వేసవి రద్దీ కోసం968 ప్రత్యేక రైళ్లు

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే విధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 30వ తేదీ నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.   ముంబై, పూణే, షిర్డీల నుంచి దేశంలోని వివిధ గమ్యస్థానాలకు 574 వేసవి స్పెషల్‌ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా సెంట్రల్ రైల్వే సమ్మర్ స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త రైళ్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, మన్మాడ్, నాగ్‌పూర్, మాల్దా టౌన్, రేవాల మధ్య 126 వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. దాదర్, మడ్గావ్ ల మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి.లోకమాన్య తిలక్ టెర్మినస్, షాలిమార్, బల్లియా, గోరఖ్‌పూర్, సమస్తిపూర్, థివిమ్ ల మధ్య 282 సమ్మర్ స్పెషల్‌లు నడుస్తాయి.
పన్వెల్, కర్మాలి మధ్య 18 సమ్మర్ స్పెషల్స్ నడుస్తుండగా, నాగ్ పూర్, మడ్గావ్ ల మధ్య 20 సమ్మర్ స్పెషల్స్ అందుబాటులో ఉంటాయి.పూణే, కర్మాలి, జైపూర్, దానాపూర్, విరంగన లక్ష్మీబాయి స్టేషన్, కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ల మధ్య 100 వేసవి స్పెషల్‌లు నడుస్తాయి.
సాయినగర్ షిర్డీ, దహర్ కా బాలాజీల మధ్య, సెంట్రల్ రైల్వే 20 వేసవి స్పెషల్‌లను నడపనుంది.లాతూర్,బీదర్ నగరాల మధ్య రెండు సమ్మర్ స్పెషల్స్ అందుబాటులో ఉంటాయి.ఈ అన్ని వేసవి ప్రత్యేక రైళ్ల బుకింగ్‌లు ఇప్పటికే తెరిచారు. ఇక, తిరుపతి-హైదరాబాద్‌, తిరుపతి ఔరంగాబాద్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.

హైదరాబాద్‌-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్‌ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. తిరుపతి-హైదరాబాద్‌ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

తిరుపతి – ఔరంగాబాద్‌ (07511) స్పెషల్‌ ట్రైన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్‌ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది.