భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి   ప్రధాని!

ఏడాది పాటు జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న భీమవరంలో  శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రయత్నాలు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహకారంతో ఫలించినట్లు క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ప్రకటించింది.

భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాకరంగా జరుపుతున్న  “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా గుర్తింపుకు నోచుకోని స్వతంత్ర వీరులను గౌరవిస్తున్న సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలని నిర్ణయ్హించింది. 
 
 తెలుగు రాష్ట్రల సాంస్కృతిక మంత్రిత్వ శాఖల వారి సౌజన్యం తో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) పలు కార్యక్రమాలను   తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టి తరువాత దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించిందని అధ్యక్షులు పేరిచెర్ల నాగరాజు.  ప్రధాన కార్యదర్శి  నడింపల్లి నాని రాజు తెలిపారు. 
 
జులై 4న అల్లూరి  స్వగ్రామం మోగల్లు గ్రామంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సహాయంతో నిర్మించే చారిత్రాత్మక కట్టడాన్ని ప్రధాని జాతికి అంకితం కావిస్తారు. అల్లూరి బాల్యంలో గడిపిన మొగల్లు  గ్రామంలోని ఇంటిని రీ మోడల్ జరిపి అల్లూరి ధ్యాన మందిరంగా జాతికి అంకితం చేస్తారు. అక్కడ, అల్లూరి జీవిత చరిత్ర, విశేషాలని భద్రపరుస్తారు. తద్వారా అల్లూరి స్వగ్రామం మోగల్లు ఒక  ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది.

అల్లూరి  తల్లి స్వగ్రామం, ఆయన పుట్టిన పాండ్రంగి గ్రామంలో ఆయన ఆనవాళ్లను పునరుద్ధరించి కాపాడుతారు. రాష్ట్ర, కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో, కృష్ణదేవి పేట లో ఉన్న  అల్లూరి సీతారామరాజు ఉద్యానవనం సుందరీకరణ పనులు చేబడతారు. అల్లూరి  తనకు తానుగా బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోయిన మంప గ్రామం కు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేస్తారు.  ఏ చెరువు ఒడ్డున అయితే లొంగిపోయారో, ఆ చెరువు సుందరీకరణ, చెరువు మధ్యలో అల్లూరి విగ్రహ ప్రతిష్ట చేస్తారు.
 
జులై 4 నుండి ఒక సంవత్సరం పాటూ వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, స్థానిక ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సేవా మరియు స్వచ్చంద సంస్థలు, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియ సేవా సమితులు, క్షత్రియ యువజన సంఘాలు, మహిళా సంఘాల సహాయ సహకరాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు
మే 7 న ట్విట్టర్లో అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా ప్రధాని  నివాళులు అర్పించడం, ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించడం జరుగుతుంది. “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి అల్లూరి సీతారామరాజు గురించి ప్రస్తావిస్తారు. అదే రోజున,  రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఉదయం 11 గంటలకు  తెలంగాణా ప్రభుత్వం ఘన నివాళి అర్పిస్తోంది. మంత్రులు   కె టి రామారావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొంటారు.
 
మే 7  సాయంత్రంకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  ఏపీ మంత్రి  మంత్రులు శ్రీమతి రోజా  వైజాగ్ లో ఘన నివాళి అర్పిస్తారు. పాండ్రంగి నుండి వైజాగ్ వరకు జరిగే  యువకుల బైక్ రాలీలో పాల్గొంటారు.

ఆగస్ట్ 22 రంప తిరుగుబాటుకు 100 సంవత్సరాలు. ఆగస్ట్ 22, 1922 న చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడితో మన్యం తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 22, 2022 న చింతపల్లి నుండి ర్యాలీ జరుపుతారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆనవాళ్లను పునరుద్ధరిస్తారు. మన్యంలో అల్లూరి చరిత్రతో ముడిపడి ఉన్న  విప్లవ ఆనవాళ్లను . రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం తదితర చోట్ల కాపాడే ప్రయత్నం చేస్తారు.

అల్లూరి  జీవిత చరిత్రను 15 ని.లు నిడివి గల 3డి అనిమేషన్ చిత్రం నిర్మాణం, అల్లూరి విశిష్టతను తెలిచేస్తూ రాంభట్ల నృసింహా చారి రచనలో మాధవపెద్ది సురేష్ గారి సంగీత సారధ్యంలో ఒక అద్భుతమైన పాట జాతికి అంకితం చేస్తారు.  ముఖ్యంగా అల్లూరితో  కలసి పనిచేసిన పలు వీరుల (గంటం దొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, అగ్గిరాజు….) కుటుంబాలను గుర్తించి, వారి ఆర్ధిక స్థితి గతులు తెలుసుకుని, వారి కుటుంబాలను ఆర్ధికంగా, సామాజికంగా ఆదుకుని శాశ్వత పరిష్కారం అందించే ప్రయత్నం చేస్తారు.


మే7, 2023 – దేశ వ్యాప్తంగా ఇటు కేంద్ర, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలచే అధికారిక శ్రద్ధాంజలి. జులై 4, 2023 – లంబసింగి ప్రాంతంలో రో 35 కోట్ల తో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న స్వాతంత్య్ర  సమరయోధుల మ్యూజియం జాతికి అంకితం ద్వారా సంవత్సరం పాటూ నిర్వహించ తలపెట్టిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి జాతీయ సంబరాలు ముగుస్తాయ
 
కాగా, అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లిమెంట్ లో ప్రతిష్టించాలని, విశాఖపట్నం లో రానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి  అల్లూరి సీతారామరాజు గారి పేరు  పెట్టాలని, భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన మన్యం తిరుగుబాటు ను దేశ వ్యాప్తంగా అన్ని సిలబస్ లో పాఠ్యంసంగా చేయాలని వారు ప్రధాని మోదీని కోరారు.