తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలు ప్రభుత్వ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వివాదం చెలరేగింది.
ఇటీవల తంజావూరు జిల్లాలోని వేప్పత్తూర్ పంచాయతీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫొటోను తొలగించారు. పంచాయతీ చైర్‌పర్సన్ అంజమ్మాళ్ తన భర్త ఆదేశాల మేరకు మోదీ ఫొటోను తొలగించారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.
ఇదిలా ఉండగా, బీజేపీ కౌన్సిలర్ ఎస్ చంద్రశేఖరన్.. ప్రధాని మోదీ ఫొటోను కార్యనిర్వాహక అధికారికి ఇచ్చి పంచాయతీ ఆఫీసులో పెట్టాలని కోరాడు. దీంతో ఆయన పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీన చైర్‌పర్సన్ అంజమ్మల్మో దీ ఫొటోను తొలగించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ క్రమంలో అధికార డీఎంకే పార్టీకే బీజేపీ నేతల మధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పంచాయతీ కార్యాలయంలో మోదీ ఫొటోను తిరిగి ఏర్పాటు చేశారు. ఈ వివాదం రాష్ట్రంలో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీయగా డీఎంకే అధిష్టానం నేతలను సున్నితంగా మందలించింది. ఇలాంటి చర్యలతో బీజేపీ ఎదుగుదలకు అకాశం ఇవ్వవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు డీఎంకే సూచించింది.

More Stories
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక
ఛత్తీస్‌గఢ్‌లో 14 మావోయిస్టుల డంప్‌లు గుర్తింపు