
అయితే, శాసనసభలో ఆమోదం పొందడాన్ని లాంఛనంగా మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నాయి. శాసనసభ ఆమోదం లేకుండానే లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తునాుయి. 2020ా-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా రూ 1,10,509.12 కోట్లను ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొంది. ఐదు గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్స్‌లో ఈ లావాదేవీలు చోటుచేసుకున్నట్లు తెలిపింది.
తెలుగుదేశం పార్టీ పాలన సాగిన 2014-15 నుండి 2019-20 మధ్య కాలంలో కూడా ఈ తరహా ఖర్చు భారీగానే చేశారు. రూ 2,36, 811.96 కోట్లను ఆ ఐదేళ్ళలో శాసనసభ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు పేర్కొన్న కాగ్, ఆ మొత్తానికి ఇప్పటికి కూడా శాసనసభ ఆమోదం తెలపలేదని పేర్కొంది.
‘రాజ్యాంగంలోని 204, 205 అధికరణాల ప్రకారం శాసనసభ ఆమోదం పొందిన చట్టం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. రాష్ట్రంలో ఆ అధికరణాల ఉల్లంఘన జరుగుతోంది. ఇది ఆర్థిక నియంత్రణ, బడ్జెటరీ విధానాలను నీరు గారుస్తుంది. ఆర్థిక అరాచకత్వానికి, ప్రజా వనరులను సక్రమంగా నిర్వహించకపోవడానికి దారి తీస్తుంది.’ అని కాగ్ స్పష్టం చేసింది.
కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ 17వేల కోట్ల అదనపు వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ అనుమతి తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం.
ప్రత్యేక బిల్లులపైన కూడా కాగ్ తీవ్రంగానే స్పందించింది. రూ 48,284 కోట్ల బిల్లులను స్పెషల్ బిల్లులుగా చూపించడాన్ని ఆక్షేపించింది. సర్దుబాటు బిల్లులు కూడా రూ 54,092 కోట్లుగా చూపించారని, ఇలా మార్పు చేసే అధికారం ట్రెజరీ నిబంధనలకు విరుద్ధమని కాగ్ పేర్కొంది.
మరో రూ 26,839 కోట్ల బిల్లులను ప్రభుత్వ ఆదేశాల మేరకే పద్దుల్లో చూపించినట్లు ప్రభుత్వం పేర్కొందని, అయితే ఉత్తర్వుల్లో మాత్రం సరైన కారణాలు కనిపించలేదని పేర్కొంది. ఇలా పనులు, స్థానిక సంస్థల పద్దులను మార్పు చేయడం కూడా ట్రెజరీ నిబంధనలకు వ్యతిరేకమని కాగ్ తెలిపింది. మరో 16,688 ఎంట్రీలకు సంబంధించి రూ 9127 కోట్ల నిధుల వినియోగంపైనా కాగ్ పెదవి విరిచింది.
ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ విఫలం కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆర్ధికశాఖ చెప్పడాన్ని కూడా సరికాదన్న భావాన్ని కాగ్ వ్యక్తం చేసింది.మరో రూ 8891 కోట్లను నిర్దిష్టమైన విడుదల ఆదేశాలు లేకుండానే ఖర్చు చేశారని పేర్కొంది. బడ్జెట్ ప్రతిపాదనలకు విరుద్ధంగా రూ 48,757 కోట్లను అదనంగా వ్యయం చేశారని, ఇది మొత్తం గ్రాంట్లలో 19 శాతంగా ఉందని కాగ్ గుర్తించింది.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు