ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై స‌స్పెన్ష‌న్ వేటు

నిఘా ప‌రిక‌రాల కొనుగోలు కోసం రూ.25.5కోట్లు వెచ్చించి..అందులో నిబంధ‌న‌లే ఏమాత్రం పాటించ‌లేద‌ని ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది వైసీపీ ప్ర‌భుత్వం.

 ఏపీ ప్ర‌భుత్వం త‌న‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను స‌వాల్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి ఏబీ అప్పీల్ చేసుకున్నారు. తాజాగా ఈ అప్పీల్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. 

 పెగాసస్‌ తరహాలో  రాజకీయ నేతలు, ప్రతిపక్షాలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన నిఘా పెట్టడం కోసం ఇంటెలిజెన్స్‌ ఛీప్‌ ఏబీ వెంకటేశ్వరావు ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం రూ.25.5 కోట్ల రూపాయలు వెచ్చించారని అంటూ వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక పేర్కొంటున్నది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. దీనిపై కేంద్రానికి ఏబీ వెంకటేశ్వరావు అప్పిలు చేసుకోగా, ఆయన అభ్యర్థనను కేంద్ర హోం శాఖ తోసిపుచ్చి వెంకటేశ్వరరావుపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని పేర్కొంది. ఆయనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ  ఖరారు చేసింది. ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.

కాగా, క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్‌ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ‘ఆర్‌టీ ఇన్‌ఫ్లేటబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. 

రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు  చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి.అవేవీ పాటిం చలేదు. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్‌ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.