విశాఖ ఏజెన్సీ నుండి హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గంజాయి!

ఏపీ  ప్రభుత్వం ఉదాసీనత, ప్రభుత్వంలోని పెద్దల మద్దతు కారణం కావచ్చు విశాఖ ఏజెన్సీ ఇప్పుడు దేశంలోనే గంజాయి ఉత్పత్తిలో ప్రఖ్యాతి చెందుతున్నది. అక్కడి నుండి గంజాయి హైదరాబాద్ కు అక్రమ రవాణా జరగడం, ఇక్కడ దానిని ద్రవరూపంలో చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉండడం జరుగుతున్నది. 

తెలంగాణ పోలీసులు ఆ విధంగా విశాఖ ఏజెన్సీ నుండి అక్రమ రవాణా అవుతున్న గంజాయిని పలుమార్లు పట్టుకున్నా, స్వయంగా విశాఖ ఏజెన్సీకి వెళ్లి అరెస్టులు జరిపిన ప్రయోజనం ఉండడం లేదు. నగరంలో కూడా ఐటి ఉద్యోగులకు పెద్ద ఎత్తున గంజాయి సరఫరా జరుగుతున్నట్లు తాజాగా పోలీసులు జరిపిన పలు దాడులలో వెల్లడైనది.

వైజాగ్ నుండి హైదరాబాద్ కు   గంజాయ్ సప్లయ్ చేస్తున్న ఏడుగురు సభ్యుల గ్యాంగ్ లో నలుగురిని రాచకొండ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి రూ.32 లక్షల విలువైన 80 కిలోల గంజాయి, 2 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సంప్రీత్ సింగ్  వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన వద్య ముఖేశ్(25), చౌహాన్ శ్రీనివాస్(23), వద్య మారుతి(26), రాథోడ్ నవీన్(22), వద్య అనిల్(22)  ఐదుగురు కలిసి ఈజీ మనీ కోసం గంజాయి సరఫరాకు స్కెచ్ వేశారు. వైజాగ్ లోని ఏజెన్సీ ఏరియాకి చెందిన రమేశ్ అలియాస్ ఏలియా, కామేశ్​ దగ్గర నుంచి తక్కువ రేటుకి గంజాయిని కొని తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నారు.

ఈ నెల 18న ముఖేశ్, శ్రీనివాస్, నవీన్, అనిల్ రెండు కార్లను రెంట్ కి తీసుకుని వైజాగ్ లోని లంబసింగికి వెళ్లారు. అక్కడి 80 కిలోల గంజాయి కొన్నారు. శనివారం సిటీకి వస్తుండగా.. రాచకొండ ఎస్ వోటీ పోలీసులు పెద్ద అంబర్ పేట వద్ద కార్లను అడ్డుకుని నలుగురిని అదపులోకి తీసుకొని,  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవంక, గంజాయి తరలిస్తున్న వ్యక్తిని గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ కి చెందిన షేక్ ముదాసీర్(20) వైజాగ్  నుంచి గంజాయిని తీసుకుని సిటీకి వచ్చాడు. శనివారం ముషీరాబాద్ క్రాస్ రోడ్ లో ఉన్న ముదాసీర్ ను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కి తరలించినట్లు ఇన్ స్పెక్టర్ మోహన్ రావు తెలిపారు.

హైదరాబాద్ లో  గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 775 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

మరోవంక, దూల్‌‌‌‌పేట్‌‌‌‌కి చెందిన మహేందర్ సింగ్‌‌‌‌(35) జుమాటో డెలివరీ బాయ్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఫుడ్‌‌‌‌ డెలివరీతో కస్టమర్ల ఫోన్‌‌‌‌ నంబర్ల కలెక్ట్ చేశాడు.  ఐటీ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకున్నాడు. దూల్‌‌‌‌పేట్‌‌‌‌లోని డీలర్స్‌‌‌‌ వద్ద గంజాయి కొని వాటిని ప్యాకింగ్‌‌‌‌ చేసి ఐటీ ఉద్యోగుల నుంచి ముందస్తు ఆర్డర్స్‌‌‌‌ తీసుకునేవాడు. స్కూటీపై తిరుగుతూ డోర్‌‌‌‌‌‌‌‌ డెలివరీ చేసేవాడు. 

శుక్రవారం కాచిగూడ వెంకటరమణ థియేటర్‌‌‌‌‌‌‌‌ సమీపంలో రాత్రి ఆర్డర్‌‌‌‌‌‌‌‌ డెలివరీ చేసేందుకు వచ్చిన మహేందర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహేందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ ఇచ్చిన సమాచారంతో అతడి కస్టమర్లు అయిన నలుగురు ఐటీ ఉద్యోగులను  అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్‌‌‌‌ యాప్రాల్‌‌‌‌కి చెందిన జవల పాండే(25) స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ట్రేడర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. వెస్ట్‌‌‌‌మారేడ్‌‌‌‌పల్లికి చెందిన నిఖిల్ షేనయ్‌‌‌‌(33) డీజే ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా చేస్తున్నాడు. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా ధర్మవరంకి చెందిన సోనే రావు(50), లఖన్‌‌‌‌(53) గంజాయి సాగు చేస్తున్నారు. అదే జిల్లా మల్లాపూర్‌‌‌‌‌‌‌‌కి చెందిన అమర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌(37), సాబెల్‌‌‌‌(25),  సకరమ్ సాబెల్‌‌‌‌(25), గోటి హరిసింగ్‌‌‌‌(50)తో కలిసి సిటీకి గంజాయిని రవాణా చేస్తున్నారు. 

ఆదిలాబాద్‌‌‌‌ ధర్మవరం, వైజాగ్‌‌‌‌ అరకు నుంచి వచ్చే గంజాయి, హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను జవల పాండే, నిఖిల్‌‌‌‌ కొనేవారు. పుదుచ్చేరిలో ఉంటున్న నైజీరియన్‌‌‌‌ నికోలస్‌‌‌‌ ఒలుసొల రొటిమి (33) నుంచి జవల పాండే ఎమ్‌‌‌‌డీఎమ్‌‌‌‌ఏ డ్రగ్స్ కొంటున్నాడు. ఇలా ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అయిన గంజాయి,హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌, డ్రగ్స్​ను సిటీలోని ఐటీ ఉద్యోగులకు  పాండే సరఫరా చేస్తున్నాడు. 

అపోలో హెల్త్‌‌‌‌ అండ్ లైఫ్ స్టైల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ అదిత్య రాజన్‌‌‌‌ (34), కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో ఉండే విద్యార్థి  జయబాలాజీని సప్లయర్స్​గా మార్చిన పాండే వారికి గంజాయిని అందించేవాడు. రూ.10 వేలకు కిలో గంజాయి కొని రూ.50 వేలకు అమ్మేవాడు. ఆదిత్య రాజన్‌‌‌‌, జయబాలాజీ  గంజాయిని ఆర్డర్స్ ను బట్టి  ప్యాక్‌‌‌‌ చేసేవారు. ఓయో రూమ్​ల్లో జరిగే పార్టీలకు సప్లయ్ చేసేవారు. 

దీని గురించి సమాచారం అందుకున్న నార్కొటిక్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌ జవల పాండేపై నిఘా పెట్టింది. శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించింది. గంజాయి సాగు చేస్తున్న ఆదిలాబాద్​కి చెందిన సోనే రావుతో పాటు నలుగురు ట్రాన్స్‌‌‌‌పోర్టర్స్ సహా మొత్తం 16 మందిని అరెస్ట్‌‌‌‌ చేసింది. 10 గ్రాముల డ్రగ్స్,100 గ్రాముల హాష్ ఆయిల్‌‌‌‌,8  కిలోల గంజాయి,కారు, 3 బైక్​లను స్వాధీనం చేసుకుంది.

కాగా, ఆదిలాబాద్ జిల్లా జామిది గ్రామం వద్ద  శనివారం సాయంత్రం మండలంలోని జామిడి గ్రామం వద్ద సిరిసెల్మ నుంచి ఇచ్చోడ వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి దొరకడంతో వాహనంపై ఉన్న ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించగా ఒకరిని పట్టుకున్నారు. 5కిలోల గంజాయి స్వాధీనం పర్చుకున్నారు.