ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్

ఉక్రెయిన్ లో ఉన్న 20వేలకు పైగా భారతీయుల ఇబ్బందులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థుల కుటుంబాల కోసం రాష్ట్ర బీజేపీ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన్నట్లు ఆయన వెల్లడించారు. తమకొచ్చిన నెంబర్లకు వీడియో కాల్ చేసి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  వెంటనే ఉక్రెయిన్ పరిస్థితులను సమీక్షించి, భారతీయులను కాపాడే చర్యలు మొదలు పెట్టారని చెప్పారు.  కరీంనగర్ నుంచి ఉక్రెయిన్ వెళ్లిన పలు విద్యార్థుల కుటుంబాలను నిన్న రాత్రి వరకు కలిసి, వారికి భరోసా కల్పించామని పేర్కొన్నారు. 

పలువురు విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడానని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని చెబుతూ  జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం లేదని రష్యా హామీ ఇచ్చిందని వెల్లడించారు.

కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంజయ్ భరోసా ఇచ్చారు. భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ప్రధాని మోదీ  హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. న్నారు. . అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులు భారత జెండాలు పట్టుకోవాలి 

ఇలా  ఉండగా, ఉక్రెయిన్‌‌లోని భారత విద్యార్థులు తమ వాహనాలపై భారతీయ జెండాను పెట్టుకోవాలని ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ సూచించింది.  వారంతా  హంగేరి బోర్డర్‌ చెక్‌పోస్టుకు చేరుకోవాలని కోరింది. 

తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు రెండు విమానాలను సిద్ధం చేసింది. శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత్‌ సర్కార్ పంపించనుంది. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరుతాయి.

ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పట్టనుంది.