కేటాయింపులు లకుండా రూ 94 వేలు కోట్లు ఖర్చు చేసిన జగన్

నిబంధనలకు తిలోదకాలిచ్చి, అడ్డదిడ్డంగా ఆర్ధిక వ్యవహారాలు సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రుణాలకు అనుమతి కోసం అధికారులను ప్రతి వారం ఢిల్లీకి పంపుతున్నా చుక్కెదురవుతున్నది. తాజాగా అసలు బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు లేకుండా రూ 94 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన విషయమై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

అంటే ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసిన్నట్లు తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. బడ్జెట్‌ నిబంధనలను ఉల్లంఘించి ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం పట్ల ఎజి తీవ్ర స్థాయిలో ఆక్షేపణ తెలిపింది. నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా బడ్జెట్‌లో ప్రతిపాదించి శాసనసభ ఆమోదం పొందాల్సిఉంటుంది. 

దానికి భిన్నంగా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పట్ల ఎజి విస్మయాన్ని వ్యక్తం చేసింది. డిసెంబర్‌ నెల వరకు 124 లావాదేవీల్లో కేటాయింపులు, అనుమతులు లేకుండానే ఖర్చు చేసినట్లు ఎజి గుర్తించింది. వీటిలో ఒక్క ద్రవ్య నిర్వహణ-ప్రణాళిక విభాగంలోనే రూ 92,466 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విభాగం కింద 24 లావాదేవీల్లో ఈ ఖర్చు జరిగింది.

సంక్షేమానికి భారీగానే నిధులను బడ్జెట్‌లో ఆమోదించినప్పటికీ ఇంత మొత్తాన్ని ఆర్ధికశాఖ దేనికి ఖర్చు చేసిరదన్నది తేలాల్సి ఉరది. అదే విధంగా బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా విద్యుత్‌ శాఖ ద్వారా మరో రూ 826 కోట్లు, హోంశాఖ ద్వారా రూ 621 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా  రూ 144 కోట్లు ఖర్చు చేసినట్లు ఎజి గుర్తించింది.

ఇవి కాకుండా మరో 38 శాఖలకు సంబంధిరచి బడ్జెట్‌లో ఆమోదిరచిన నిధుల కన్నా ఎక్కువగా వ్యయం చేయడం విశేషం. ఈ శాఖల ద్వారా  రూ 17 వేల కోట్ల వరకు వ్యయం చేసేందుకు  ఆమోదం పొందగా, ఏకంగా రూ 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడైనది. 

ఎపి ఫైనాన్స్‌ కమిషన్‌లోని 3, 4 ఆర్టికల్స్‌, అదే విధంగా 38 నుంచి 44 వరకు ఉన్న ఆర్టికల్స్‌ను. 56 వ ఆర్టికల్‌ను బడ్జెట్‌ నిర్వహణలో తప్పనిసరిగా పాటించాల్సిఉంది. వీటి ప్రకారం బడ్జెట్‌ సమయంలోనే వివిధ శాఖలకు అవసరమైన నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో అనుబంధ అంచనాల్లో నైనా  వీటిని చూపించాల్సి ఉంటుంది. 

 అలాగే బడ్జెట్‌లో చూపించిన దానికన్నా ఏ మాత్రం వ్యయం పెరగడానికి వీల్లేదు. ఈ నిబంధలన్నింటికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను నిర్వహిస్తోందని ఎజి కార్యాలయం ఆక్షేపించింది. ఈ తప్పులను సరిదిద్దుకోవాలని సూచించింది.