ఉగ్రవాదుల అడ్డగా హైదరాబాద్

దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా మందిరం నుండి డిసెంబర్ 21, 2013న   బాంబు పేలుళ్లు జరిగిన రాజీవ్ చౌక్  వరకు  ఉగ్రవాద వ్యతిరేక వేదిక (ఎటిఎఫ్) ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు.  ఈ ర్యాలీలో నాడు బాంబు పేలుళ్ళలో గాయపడిన బాధితులు , మరణించిన వారి కుటుంబ సభ్యులు,  విద్యార్డులు పాల్గొన్నారు . నాటి బాంబు పేలుళ్ళలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. 
 
 అనంతరం జరిగిన సభలో ఎటిఎఫ్  కన్వీనర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఎలాంటి విద్రోహ కార్యక్రమాలు వెలుగు చూసినా దాని మూలాలు హైదరాబాద్ వైపు దారి తీయడం చూస్తుంటే ఉగ్రవాదులు హైదరాబాద్ ను షెల్టర్ జోన్ గా చేసుకున్నట్లు స్పష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ లోని స్థానిక రాజకీయ అండదండలతోనే ఉగ్రవాదులు యదేచ్ఛగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు గతంలో అనేక సందర్భాలలో బయటపడిందని ఆయన తెలిపారు. పలు సార్లు  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందాలు హైదరాబాద్ కు వచ్చి పలు కేసుల సందర్భంగా ఇక్కడ   అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినదని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్ లో జరిగిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్క్, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన,  గాయపడిన కుటుంబాలకు ఇప్పటి వరకూ ప్రభుత్వాల నుండి అందాల్సిన సాయం పూర్తి స్థాయిలో అందకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  ఆ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 దిల్‌సుఖ్ నగర్ లో పేలుళ్ళకు పాల్పడిన ఐఎం  ఉగ్రవాదులకు ఎన్ఐఎ  కోర్టు విధించిన మరణశిక్షను వెంటనే అమలు చేయాలని, ఉగ్రవాద మూలాలను ఏరివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.  ఈకార్యక్రమంలో ఎటిఎఫ్స భ్యులు బ్రహ్మచారి, నవీన్ , తదితరులు పాల్గొన్నారు .