సరిహద్దుల్లో హామీలను ఉల్లంఘిస్తున్న చైనా 

“వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలను పోగు చేయడం రాతపూర్వకంగా ఇచ్చిన హామీల ఉల్లంఘనే” అని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ విమర్శించారు. ఆయన ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్‌తో మెల్‌బోర్న్‌లో భేటీ అయ్యాక ఈ విషయం చెప్పారు. వారిరువు భారతచైనా పరిస్థితిపై చర్చించారు. 

ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా, నాటో సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించాక అక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఆందోళనలను వ్యక్తం చేస్తున్న తరుణంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలను పోగుచేస్తోందని జైశంకర్ ప్రస్తావింఛాయారు. 

ఈ సందర్భంగా “ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత్య దేశాల మాదిరిగానే బజార్ట్జ్ వ్యవహరించనుందా?” అని అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. “అక్కడ రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగవచ్చు” అని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో “దౌత్యం పనిచేయాలి” అని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

“సరిహద్దు వద్ద బలగాలను కూడగట్టకూడదని మాతో రాతపూర్వక ఒప్పందాలను 2020లో చైనా విస్మరించిన కారణంగా, లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. ఇది చట్టబద్ధమైన సమస్య అని నేను భావిస్తున్నాను. ఇది మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన ఆందోళన” అని జైశంకర్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. 

“ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన ‘క్వాడ్ ఫోరమ్’ చైనాను అదుపు చేసేందుకు రూపొందించిన ఆయుధం” అని చైనా ప్రకటించింది. అయితే శుక్రవారం సమావేశమైన క్వాడ్ ఫోరమ్ “ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం, సుస్థిరతను సాధించడమే” తమ లక్ష్యం అని స్పష్టం చేసింది.  “మా రికార్డు, చర్యలు, వైఖరి చాలా స్పష్టమైనది. పదేపదే వాటిని విమర్శించడం ద్వారా మమ్మల్ని తక్కువ చేయలేరు” అని కూడా జైశంకర్ ఘాటుగా చైనాకు సమాధానం ఇచ్చారు.