విశాఖ జిల్లాలో ఎక్యూఎఫ్‌ డిపిఆర్‌కు సమయం

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ (ఎక్యూఎఫ్‌) ఏర్పాటు నిమిత్తం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)కు సమయం పడుతుందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు.
 
 బ్రూడ్‌స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్‌ (బిఎంసి)ను ఏర్పాటు చేయడానికి, డిపిఆర్‌ తయారీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఎస్‌పిఎఫ్‌ ఎల్‌ వన్నామీ ఉత్పత్తి చేసే రాజీవ్‌ గాంధీ సెంటర్‌ఫర్‌ ఆక్వాకల్చర్‌ (ఆర్‌జిసిఎ), మెరైన్‌ ప్రొడక్ట్‌ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా)కి సూత్రప్రాయ అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.
 
 అనంతరం రూ.36.51 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, రూ.24.38 కోట్లు రాష్ట్రీ కృషి వికాస్‌ యోజన కింద అనుమతించామని వైసిపి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 23 నెలల్లో ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. 
 
 అయితే, కరోనా నేపథ్యంలో జెర్మ్‌ప్లాజమ్‌ను సరఫరా చేసే వారి ఎంపిక నిమిత్తం ఆలస్యమైందని, ఎంపిక అనంతరం పూర్తి డిపిఆర్‌ తయారీ అవుతుందని ఎంపెడా తెలిపిందని కేంద్ర మంత్రి వివరించారు.
 
కాగా, విశాఖపట్నాం- చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ (విసిఐసి)లో మూడు నోడ్లు గుర్తించామని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. కడప, కొప్పర్తి, చిత్తూరు, విశాఖపట్నం నోడ్లు గుర్తించగా.. విశాఖ నోడ్‌ను సొంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచిందని వైసిపి ఎంపి పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి సమాధానమిచ్చారు.
 
శ్రీకాకుళం జిల్లాలో రెండు చేనేత క్లస్టర్లకు ఆర్ధిక సహాయం
 
శ్రీకాకుళం జిల్లాలోని రెండు చేనేత క్లస్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం మంజూరు చేసినట్లు టెక్స్‌టైల్స్‌ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోషి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి ఆర్థికసాయం చేశామని రాజ్యసభలో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 
 
పొందూరు క్లస్టర్‌కు ఆర్థిక సహాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఆమె పేర్కొన్నారు. పొందూరు ఖాదీకి ప్రస్తుతానికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జిఐ) ట్యాగ్‌ లేదని చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపిందని దర్శన జర్దోష్‌ వివరించారు.ttam