లావణ్య కేసు సీబీఐకి అప్పచెప్పిన హైకోర్టు

బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చారన్న ఆరోపణపై ఆత్మహత్యకు పాల్పడిన 17 ఏళ్ల యువతి లావణ్య మృతి  కేసు దర్యాప్తును మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సోమవారం సిబిఐకి బదిలీ చేసింది. 
 
ఆత్మహత్యకు పాల్పడిన బాలిక తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు పాఠశాల యాజమాన్యం తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం జస్టిస్ జిఆర్ స్వామినాథన్ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
 
డీఎంకే ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నీరు కారుస్తున్నదని, నిందితులపై చర్య తీసుకోవలసింది పోయి బాధితులనే వేధిస్తున్నారని అంటూ ఆమె కుటుంభం సభ్యులతో పాటు బిజెపి నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.  
 బాలికకు మరణానంతరం న్యాయం అందచేయాల్సిన బాధ్యత తమపై ఉందని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు సరైన దారిలో సాగుతోందన్న అభిప్రాయం కలగడం లేదని, రాష్ట్ర పోలీసుల నుంచి ఈ కేసు దర్యాప్తును చేపట్టేందుకు ఒక అధికారిని నియమించవలసిందిగా న్యూఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్‌ను ఆదేశిస్తున్నానని ఆయన చెప్పారు.
అరియాలూరు జిల్లాలోని తంజావూరులో ఒక మిషనరీ స్కూలులో చదువుతున్న ఒక 17 ఏళ్ల బాలిక కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లో ఉంటున్న ఆ బాలికను క్రైస్తవ మతంలోకి బలవంతంగా మార్చినట్లు ఒక వీడియో క్లిప్పింగ్ బయటపడింది. కాగా ఈ ఆరోపణలను స్కూలు యాజమాన్యం ఖండించింది.
 
జనవరి 19న ఆత్మహత్యకు ఆ బాలిక వదిలి వెళ్లిన  44 సెకన్ల వీడియో  వైరల్‌గా మారడంతో తమిళనాడులోని మిషన్ పాఠశాలలో జరుగుతున్న మతమార్పిడి భాగోతం బహిర్గతమైనది. అయితే దర్యాప్తు పూర్తికాకుండానే  “బలవంతంగా మత మార్పిడి కోణం లేదు” అని చెప్పడం ద్వారా ఈ మొత్తం కేసును పక్కదారి పట్టించేందుకు తమిళనాడు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైనది. 
 
పైగా, ఆ  వీడియోని బహిర్గతం చేసిన వ్యక్తిని వేధించడం ప్రారంభించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై కోర్ట్ ను ఆశ్రయించి  ఆ వ్యక్తిని వేధించడం ఆపమని పోలీసులను ఆదేశించేటట్లు చేశారు.  డిఎంకె ప్రభుత్వ వ్యూహాత్మక మద్దతుదారులు, “ఇది కుల వివక్ష కేసు” అని పేర్కొన్నారు. వారి సత్యాన్ని నిర్ధారించడానికి వారికి 30 మంది పిల్లలు కూడా సాక్షులుగా ఉన్నారు.

మరోవంక, ఆ బాలిక తల్లితండ్రులను వేధిస్తున్న తమిళ మీడియా ఆ వీడియోలో ఆమె  అబద్దాలు చెప్పారని ప్రయత్నం చేయడం ప్రారంభించింది.  మరింత దుర్మార్గమైన చర్యలో భాగంగా  కొంతమంది బ్లూ టిక్ సోషల్ మీడియా వినియోగదారులు మరణించిన బాలికపై దాడిని తదుపరి స్థాయికి తీసుకువెళ్లారు. 

 
సవతి తల్లి అసభ్యంగా ప్రవర్తించిందని ఫిర్యాదు చేస్తూ ఒక బాలిక చేసిన రెండేళ్ల అనామక కాల్‌ను వారు లావణ్య కేసుకు కనెక్ట్ చేస్తూ కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా ఆమె  ఆత్మహత్య చేసుకుందని, క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యంకు ఏపాపం తెలియదనే కధనం వ్యాప్తి చేసే ప్రయత్నం ప్రారంభించారు. 

క్లుప్తంగా చెప్పాలంటే, “మత మార్పిడి మాఫియా”కి సహాయం చేయడానికి, ఈ   లావణ్య కేసును పాతిపెట్టడానికి మొత్తం తమిళనాడులో ప్రభుత్వ అండదండలతోనే భారీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.