బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్ సిద్ధం 

సోమవారం నుండి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించేందుకు పార్లమెంట్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

కాగా.. పార్లమెంట్ సమావేశాలలో మొదటి రెండ్రోజులు జీరో అవర్, క్వశ్చన్ అవర్‎ను రద్దు చేశారు. ఫిబ్రవరి 2నుంచి జీరో అవర్ ఉంటుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. 

ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-2023కి సంబంధించిన బడ్జెట్‎ను ప్రవేశపెడతారు. కరోనా కారణంగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి బడ్జెట్ ను రెండు విడతలుగా ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత జవనరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు.

రాజ్యసభ ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడుతో సహా వందల సంఖ్యలో పార్లమెంట్ సిబ్బంది కరోనాకు గురవడంతో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నది.