బిజెపిపై దూకుడు పెంచి కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా!

హుజురాబాద్ ఉపఎన్నికల్లో సర్వశక్తులు సమీకరించిన తమ అభ్యర్థిని గెలిపోయించుకోలేక పోవడమే కాకుండా, తనపై తిరుగుబాటు చేసి బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన ఈటెల రాజేందర్ కు 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యత లభించడంతో కలత చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిక్కుతోచక బిజెపిని లక్ష్యంగా చేసుకొని పోరాటం అంటూ మొదలుపెట్టారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తమ ఎంపీలతో నిరసనలు చేయించి, నవ్వులపాలవుతున్నామని గ్రహించి వారిని వెనుకకు పిలిపించారు.  మరోవంక, ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రారంభించారు.
ఉద్యోగుల బదిలీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి తన కార్యాలయంలో నిరసన చేపట్టిన సంజయ్ ను ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన్నట్లు పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. బెయిల్ కూడా ఇవ్వడానికి వీల్లేని సెక్షన్లు నమోదు చేశారు.
ఒక వంక హైకోర్టు మొట్టికాయలు  వేసి, సంజయ్ ను విడిపించడం, మరోవంక బీజేపీ జాతీయ నాయకత్వం ఆగ్రహంతో సంజయ్ కు బాసటగా నిలబడడంతో కేసీఆర్ కు ఏమి చేయాలో తోచినట్లు లేదు. మూడో కూటమి అంటూ ఏ ఈలోగా ప్రాంతీయ పార్టీ నేతలను కలవడం ప్రారంభించారు.
దిక్కుతోచక ఏదో ఒకటి చేయడమే  గాని,  పర్యవసానాలు ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు.
ఈ పరిస్థితులలో జనవరి 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో బిజెపిపై మరోసారి దండయాత్ర చేస్తారనే సంకేతం ఇచ్చారు.
 మంత్రివర్గం సహితం బిజెపి పైననే దృష్టి సారిస్తుంది  అన్నట్లు వ్యవహరించారు. అయితే కేసీఆర్ అర్ధాంతరంగా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం, బిజెపి గురించి పల్లెత్తు మాట తినకపోవడం ఆయన పార్టీ నేతలకు కూడా విస్మయం కలిగించింది.
సమస్యలు, విధానాలపై కాకుద్నా జాతీయ రాజకీయాలలో తలదూర్చడం, బిజెపిని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయంగా తమకే నష్టం కలిగిస్తుందని కేసీఆర్ గ్రహించిన్నట్లు చెబుతున్నారు. కొందరు మంత్రల పని తీరు, ధరణి పోర్టల్, థర్డ్ ఫ్రంట్, బీజేపి ని విమర్శించడం, బండి సంజయ్ అరెస్ట్ వంటి అంశాలు సీఎం చంద్రశేఖర్ రావు కు శరాఘాతంగా పరిణమించినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల చంద్రశేఖర్ రావు బీజేపి పై సంధించిన విమర్శనాస్త్రాలు అనుకూల ఫలితాలను ఇవ్వక పోగా ప్రభుత్వానికి హానికరంగా పరిణమించాయని వెల్లడైనది. మంత్రులు క్షేత్ర స్థాయిలో పనిచేయకుండా మీడియాలో ప్రాచూర్యం కోసం ప్రయత్నాలు
చేస్తున్రారని, ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టమని కేసీఆర్ స్వయంగా  కొంత మంది మంత్రులను భేటలో తీవ్రండామంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి ఇటీవల దేశంలో మూడో కూటమి గురించి చేసిన ప్రయత్నాలకు కూడా చెప్పుకోదగిన స్పందన లభించకపోగా బిజెపి మీద కోపంతో కాంగ్రెస్ కు సన్నిహితంగా నెట్టుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకనే మూడో కూటమి గురించి మాట్లాడడం రాజకీయంగా తనను ఇబ్బందులకు గురిచేయగలదని కేసీఆర్ గ్రహించిన్నట్లు చెబుతున్నారు. 
 
దేశ రాజకీయాలకు సంబందించిన సున్నితనమైన అంశం కాబట్టి దాని గురించి ఏమీ స్పందించకుండా ఉంటేనే మేలనుకున్న సీఎం విలేఖరుల సమావేశాన్ని రద్దు చేసేందుకు అదొక కారణంగా తెలుస్తున్నది.  
 
మరోవంక, సమయం, సందర్భం లేకుండా ప్రతి నాయకుడు నిత్యం బిజెపిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అధికార పక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రభుత్వం పనిపోయినదని, బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని సొంత పార్టీ కార్యకర్తలే భావించే ప్రమాదం ఉన్నదని కలత చెందుతున్నారు. 
 
బిజెపి ప్రస్తావిస్తున్న ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఆ పార్టీని నిత్యం దూషిస్తూపోతే ఆ పార్టీకే మేలు జరుగుతోందనిభావిస్తున్నారు. అందుకనే కొద్దికాలం ప్రజా సమస్యలు, సంక్షేమం కన్నా రాజకీయ ఆరోపణల కోసం మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని మంత్రులకు కూడా సంకేతాలు వెళ్లిన్నట్లు తెలుస్తున్నది.
 
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాటు పార్టీ ఎంపీలతో కూడా కలిసి సమావేశమైన కేసీఆర్ బిజెపి విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేసిన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో అధికారంకోసం ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలను గమనిస్తూనే అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 
 
అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం, జాతీయస్థాయిలో రాజకీయ శూన్యత ఉందని,  అవసరమైతే దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని మంత్రులు మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ ను కోరినట్లు తర్వాత `మీడియా లీక్’ ఇచ్చారు.