తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం

తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బిఆర్‌కెఆర్ భవన్‌లో కరోనా  కలకలం కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. విద్యాశాఖ, పంజాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాసరాజుకు పాజిటివ్ నిర్ధరణ అయింది. 

అలాగే జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఆయన పేషీలో ముగ్గురు పిఎస్‌లతో సహా మరికొంత మంది సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పలువురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. 

బిఆర్‌కెర్ భవన్‌లో దాదాపు 25 మంది వరకు కరోనా డ్ బారిన పడ్డట్లు సమాచారం. పేషీల్లోని సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఒకరిద్దరు అధికారులు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు కరోనా  బారిన పడి కోలుకున్నారు. 

వీరితో పాటు పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 900 మంది కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో  రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. 

ఈ క్రమంలో రాష్ట్రంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు, పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, పలువురు ఐఏఎస్ అధికారులకు వైరస్ బారినపడ్డారు. 

అదేవిధంగా, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) కొవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు

ఇలా ఉండగా, కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధి తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు మంత్రి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. 

రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని లేఖలో కోరారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదించినట్టు హరీశ్‌రావు స్పష్టం చేశారు.