చండీగఢ్ మేయర్ గా బిజెపి అభ్యర్థి కౌర్ ఎంపిక

చండీగఢ్ మేయర్ పదవికి బిజెపి అభ్యర్థి సరబ్జిత్ కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంజు కత్యాల్‌పై 14 ఓట్ల పొంది, కేవలం ఒక ఓటు తేడాతో గెలుపొందడంతో శనివారం అసెంబ్లీ హాలులో రచ్చ మొదలైంది. ఆప్, బిజెపి అభ్యర్థులకు సమానంగా 14  చొప్పున ఓట్లు వచ్చాయి.

అయితే ఆప్ కు వేసిన ఒక ఓట్ చెల్లదని ప్రకటించడంతో బిజెపి అభ్యర్థి గెలుపొందడానికి మార్గం ఏర్పడింది. దానితో ఆగ్రహం చేసిన ఆప్ సభ్యులు, అన్యాయం జరిగినదని అంటూ  నినాదాలు ఇస్తూ  కొత్తగా ఎన్నికైన మేయర్ పక్కన కూర్చుని, డిప్యూటీ కమిషనర్ వినయ్ ప్రతాప్‌ను కదలడానికి అనుమతించలేదు. 

 
దానితో సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు. కౌర్ ఇప్పుడు ఈ రెండు పదవులకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఏ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్నికలకు దూరంగా ఉంది. మొత్తం ఏడుగురు కౌన్సిలర్లు ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. వీరికి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ కూడా తోడయ్యారు.

వచ్చే నెల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతుండడం, అక్కడ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఆప్ కనిపిస్తూ ఉండడంతో, ఇప్పుడు ఆప్ అభ్యర్ధికి ఓట్ వేస్తే పంజాబ్ ఓటర్లకు తప్పుడు సంకేతం పంపినట్లు కాగలదని కాంగ్రెస్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది. దానితో ఆప్ కు ఇబ్బందులు ఎదురయ్యాయ్రి. 

 
మరోవంక, బిజెపి అభ్యర్ధికి ఓట్ వేసిన ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీని ప్రజలు మరో విధంగా అర్ధం చేసుకోగలరని కాంగ్రెస్ నాయకులు సంకట స్థితిలో పడ్డారు. 
 
చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇటీవల 35 సీట్లకు జరిగిన ఎన్నికలలో 14 సీట్లు గెలుపొందిన ఆప్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్సాహం పొందడానికి మేయర్ పదవిపై కన్నేసింది.  గతంలో గల 26 వార్డులకు గాను ఇప్పుడు 12 మాత్రమే గెలుపొందడం ద్వారా మంచి ఊపు ఇచ్చింది. 

బిజెపికి అనుకూలంగా 13 మంది కౌన్సిలర్లు ఓటు వేయగా, మున్సిపల్ హౌస్‌లో ఎక్స్ అఫీషియో సభ్యుడు అయిన పార్లమెంటు సభ్యుడు కిరణ్ ఖేర్ నుండి మరో ఓటు వచ్చింది. మేయర్ ఎన్నికల్లో ఎంపీ ఓటు వేయలేరని ఆప్ కౌన్సిలర్లు వాదించినప్పటికీ, సెక్రటరీ వారికి చట్టం కాపీని అందించారు. 
 
 అందులో ఒక ఎంపీ ఎక్స్-అఫిషియో సభ్యుడిగా ఉన్నట్లయితే, అతను లేదా ఆమె సభలో ఓటు వేయవచ్చని స్పష్టంగా ఉంది.
ఎన్నికల ప్రక్రియ ఉదయం 11:10 గంటలకు ప్రారంభమైంది.  బిజెపి కౌన్సిలర్ మహేష్ ఇందర్ సింగ్ సిద్ధూ ప్రిసైడింగ్ అధికారిగా ఉండగా, డిప్యూటీ కమిషనర్ వినయ్ ప్రతాప్ సింగ్ ఎన్నికల ప్రక్రియకు అధ్యక్షత వహించారు.