యుపి ఎన్నికల ప్రచారంలో శ్రీకృష్ణుని ప్రస్తావన

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం శ్రీకృష్ణుని ప్రస్తావనతో వేడెక్కుతోంది. కృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కృష్ణుడు చెబుతున్నాడని, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఘాటుగా తిప్పికొట్టారు. 
 
కృష్ణభగవానుడు వారిని శపిస్తాడని మాజీ సిఎం అఖిలేశ్‌కు పరోక్షంగా జవాబు ఇచ్చారు. “కొంతమందికి కృష్ణపరమాత్ముడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. వారి వైఫల్యాలకు ఇప్పుడైనా చింతించాలని చెప్పి ఉంటాడు. మీరు (అఖిలేశ్‌ను ఉద్దేశిస్తూ ) చేయలేనిది బిజెపి ప్రభుత్వం చేసి చూపిస్తోంది” అంటూ ఎద్దేవా చేశారు. 
 
పైగా, “మీరు అధికారంలో ఉన్నప్పుడు మధుర, బృందావనం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తూ భగవాన్ శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తున్నాడు” అని ఆదిత్యనాథ్ విరుచుకు పడ్డారు. 
 
660 మెగావాట్ల హర్దుగంజ్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం అలీగఢ్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుంటే లక్నోలో కొందరు కలలు కంటున్నారు.. వారి కలల్లోకి శ్రీకృష్ణుడు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. వారి వైఫల్యాలపై.. వారు చేయలేని పనిని బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు మధుర, బర్సానా, బృందావనం, గోకుల్, బల్దేవ్‌ల కోసం ఏమీ చేయడంలో విఫలమయ్యామని శ్రీకృష్ణుడు వారికి కలలో చెప్పాడని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు.

“ఆ సమయంలో కృష్ణుడు గురించి ఎవరూ బాధపడలేదు. వారు `కాన్’ లను ఆరాధించేవారు.  `కాన్’ లను సృష్టించేవారు.`కాన్’ లను  కన్స్ సృష్టించినప్పుడు, జవహర్ బాగ్ సంఘటన జరిగింది, దీనిలో ఎస్పీ (నగరం) ముకుల్ ద్వివ్దేయ్ బలిదానం చేశాడు,” అని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. .

మథురలోని జవహర్ బాగ్ ఉద్యానవనంలో జరిగిన హింసాకాండలో, ఆక్రమణదారులను ఖాళీ చేయించే క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది మరణించారు. రామ్ వృక్ష్ యాదవ్ నేతృత్వంలోని ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కల్ట్ సభ్యులు ప్రభుత్వ భూమి అయిన 270 ఎకరాల జవహర్ బాగ్‌ను రెండేళ్లుగా ఆక్రమించుకున్నారు.  వారిని తొలగించడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రామ్ వృక్ష్ యాదవ్ కూడా చనిపోయాడు.

బిజెపి ప్రభుత్వం పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా కరోనా టీకాలు, ఆహార ధాన్యాలు ఇచ్చింది, అయితే ఎస్పీ, బీఎస్పీ లేదా కాంగ్రెస్ అధికారంలో ఉంటే, వారు వారికి కావలసిన ఆహారధాన్యాలు తిని, ఉచిత టీకా కోసం డబ్బును మింగేసేవారని ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. అలా చేసిన తర్వాత, తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తన దేశం నుండి పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ వలె ఈ పార్టీలు వెళ్లిపోతాయని ఆయన ఆరోపించారు.

“కరోనా మహమ్మారి సమయంలో, వారు తమ ఇళ్ల నుండి బయటికి అడుగు పెట్టలేదు. బాబువా 20 నెలలుగా కనిపించలేదు. ఇప్పుడు, కరోనావైరస్  మూడవ వేవ్ కూడా వస్తోంది” అని అఖిలేష్ యాదవ్‌కు స్పష్టమైన సూచనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఆస్తులు ఆక్రమించిన నేరస్థులపై నేడు బుల్‌డోజర్లు నడుపుతున్నప్పుడు, సైఫాయి (ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పూర్వీకుల ఇల్లు),  సోదర-సోదరీ ద్వయం (రాహుల్, ప్రియాంక గాంధీ)లతో ఉన్న వారు  చాలా ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి బెహన్‌జీ బుల్‌డోజర్‌లను ఎందుకు ఉపయోగించాలో చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

 
దేవ్‌బంద్‌లో ఎస్పీ చీఫ్‌ను ఉద్దేశించి ఆదిత్యనాథ్ “ఇప్పటి వరకు ఊసరవెల్లి రంగు మారుతుందని తెలుసు, కానీ ఇప్పుడు బాబువా (అఖిలేష్ యాదవ్) కూడా అక్కడ ఉంటే రామ మందిరాన్ని నిర్మించి ఉండేవాడిని అని అంటున్నాడు. సిగ్గుపడే ఊసరవెల్లి.” అని ధ్వజమెత్తారు.  రామభక్తులపై కాల్పులు జరిపిన వారు అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మిస్తారని అనుకోవచ్చా? అంటూ ప్రశ్నించారు.
ఇలా ఉండగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదిపార్టీని ఏర్పాటు చేసి, రామ రాజ్యాన్ని నిర్మిస్తామని రెండు రోజుల క్రితం అఖిలేష్ చెప్పారు. శ్రీ కృష్ణుడు ప్రతిరోజు తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానని పేర్కొన్నారు.
 
పైగా,  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీ గెలుస్తుందని కృష్ణుడు కూడా అన్నారని తెలిపారు. అదే విధంగా, పొరుగు దేశం చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లు మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. మన సీఎంని చూసి వారు కూడా గ్రామాల పేర్లు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు.