గోవాలో మూడోసారి కూడా గెలుస్తామని బిజెపి ధీమా

గోవాలోని మొత్తం 40 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. గోవా బీజేపీ ఇంచార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి  సి.టి. రవి  గోవాలో పార్టీ హ్యాట్రిక్ కొట్టనుందని భరోసా వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వివిధ సర్వేలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. శాంతిభద్రతలు, అభివృద్ధి వంటి అంశాలపై పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించేందుకు పార్టీ ప్రయత్నిస్తుందని రవి చెప్పారు.
“మా కార్యకర్తలు పని చేటున్నారు. వారి నెట్‌వర్క్ బాగుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ను చేర్చడం ఆధారంగా, మేము వంద శాతం గెలుపు లక్ష్యాన్ని సాధించగలము” అని తెలిపారు. వచ్చే నెల అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉంది.
ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న టిఎంసి లేదా ఆప్ తన ఎన్నికల అవకాశాలను దెబ్బతీస్తాయని బిజెపి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీలు రాష్ట్రంలో పోస్టర్లు మాత్రమే చూస్తున్నాయని అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 
“గోవాలో ఆప్ అంటే ఏమిటి? అది నాయకుడు లేని పార్టీ, ఓటర్లు లేని పార్టీ. వారు ఎలా గెలుస్తారు? బిజెపి క్యాడర్ ఆధారిత పార్టీ, మాకు ఓటర్లు  కూడా ఉన్నారు.” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షంలో ఎవరు వస్తారో తాను చెప్పలేనని, అయితే బిజెపి అధికారంలో కొనసాగుతుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.  ‘మేం మంచి పనులు చేస్తున్నాం కాబట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది. 50 ఏళ్లలో జరిగిన దానికంటే గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు చాలా ఎక్కువ, వాటి ఆధారంగా గెలుస్తాం” అంటూ తెలిపారు.