జనవరిలోగా నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అసెంబ్లీను అడ్డుకుంటాం 

జనవరిలోగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ నిరుద్యోగ దీక్షలో మాట్లాడుతూ  బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు పుట్టిందని పేర్కొన్నారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు వేలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారనే సమాచారంతో కేసీఆర్ కు కరోనా గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. 

భయంతోనే బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతివ్వలేదని ధ్వజమెత్తారు.  నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందని పేర్కొంటూ ఉద్యోగాలు సాధించని తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులపై కేసీఆర్ కు కక్ష్య ఎందుకని నిలదీశారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేయాల్సి వస్తుందనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. 

విద్యా వాలంటీర్లను తొలగించిన మూర్ఖుడు కేసీఆర్ అని అంటూ దయ్యబట్టారు బండి సంజయ్.  గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారని, ఫిల్డ్ అసిస్టెంట్లను పీకేశారని విమర్శించారు. లక్షా 90 వేల ఉద్యాగాల ఖాళీగా ఉన్నాయనని బిశ్వాల్ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. 

జనవరి లోపల  వెంటనే ఉద్యోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే కేసీఆర్ ను తిరగనివ్వమని సంజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ, బయట బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ నడవకుండా  అడ్డుకుంటారని హెచ్చరించారు. కేసీఆర్ ను అడిగితే దొంగ దీక్షలు  ఎలా  చేయాలో చెబుతారని ఎద్దేవా చేశారు. 

ఖమ్మంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను  ఆదుకోవాలని కోరారు. 

కేసీఆర్ ప్రభుత్వంకు కాలం చెల్లింది 

 సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను పిరికిపందతో ఈటల పోల్చారు. కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. 
 
ఒక్కసారి కుప్పకూలితే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని జోస్యం చెప్పారు. బియ్యం కొనమని చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసారు.  నిరుద్యోగుల కలలను కేసీఆర్ ప్రభుత్వం కల్లలుగా మిగిల్చిందని ధ్వజమెత్తారు. 
 
పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. గతంలో మాదిరి కేసీఆర్ కోసం త్యాగాలు చేసేవారు తెలంగాణ గడ్డ మీద లేరని తెలిపారు.
ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించకుంటే భవిష్యత్తులో కేసీఆర్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.
 
తెలంగాణ గడ్డపై ఎగిరబోయేది కషాయజెండా మాత్రమేనని ఈటల స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది బీజేపీయేనన్న ఈటల.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు
 
ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టికొట్టిన దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. ఏడాదిలో‌ 145 రోజులు ఫాంహౌస్‌లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు మగ్గిపోతున్నారని చెబుతూ సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటోందని రాజేందర్ చెప్పారు.