నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది

 జూన్‌ 4వ తేదీన తెలియని నిశ్శబ్ద విప్లవం ఉంటుందని మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళి బీజేపీకి చాలా పాజిటివ్గా ఉందని పేర్కొన్నారు. అందరూ అనుకున్న దానికి భిన్నంగా పోలింగ్‌ జరిగిందని వివరించారు. ఊహించని రీతిలో ఫలితాలు సాధించబోతున్నామని స్పష్టం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలోనే దేశం ముందుకు పోతుందని, ఓటేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. “అందరూ అనుకున్న దానికి భిన్నంగా పోలింగ్‌ జరిగింది. నిశ్శబ్ద విప్లవం ఫలితం జూన్ 4న తెలుస్తుంది. మోదీ పాలనలోనే దేశం ముందుకెళ్తుందని ప్రజలు భావించారు. మా పార్టీ ఊహించని రీతిలో ఫలితాలు సాధించనుంది. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతాం” అని చెప్పారు.

 రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని చెబుతూ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడు 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారని గుర్తు చేశారు. అవి కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ బీజేపీనేనని ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పాత్ర పోషిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. 

 కాగా, ఈసారి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం తమదే అని చెబుతూ  తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు బీజేపీ కార్యకర్తలను చాలా మంది బెదిరించారని డీకే అరుణ ఆరోపించారు. 

ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదని, మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటర్లు ఓటేశారని ఆమె పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని తెలిపారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో మోదీ ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పని చేయలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ ధీమా వ్యక్తం చేశారు.