న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలి

న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు.  ప్రజాసమస్యలు, హక్కుల పరిరక్షణలో వారు కీలకపాత్ర పోషించాలని, వారి శక్తి సామర్థ్యాలు, విజ్ఞానం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని హితవు పలికారు. 

తెలుగువాడిగా మీ అందరి అభిమానం, ఆదరణ, మద్దతుతో భారతదేశ న్యాయవ్యవస్థ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో ఎక్కువ కేసులు ఉన్నాయని తెలుసని.. న్యాయమూర్తుల కొరత ఉందని,  వీలైనంత త్వరగా కొత్త జడ్జీలను నియమిస్తామని తెలిపారు. 

మిగిలిన ఖాళీలు కూడా భర్తీ చేసేందుకు హైకోర్టు సీజే కు లేఖ రాశామని, పేర్లు పంపితే ఆమోదిస్తామని తెలిపామని పేర్కొన్నారు. హైకోర్టు ఆవరణలో రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ రమణ దంపతులకు శాలువా కప్పి, గజమాలతో సత్కరించా రు. 

సుప్రీంకోర్టు న్యా యమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌  మిశ్రా ను కూడా సత్కరించారు.

సీజేఐకి గవర్నర్‌ తేనీటి విందు

 రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ గౌరవార్థం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం సాయంత్రం తేనీ టి విందు ఇచ్చారు. గవర్నర్‌ ఆహ్వానం మేరకు సతీమణితో కలిసి సీజేఐ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అంతకముందే అక్కడకు చేరుకున్న సీఎం జగన్‌ దంపతులు.. దగ్గరుండి చీఫ్‌ జస్టిస్‌ రమణ దంపతులను రాజ్‌భవన్‌లోకి తీసుకెళ్లారు. 
 
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తు లు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరి, హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, సీఎంవో అధికారులు ప్రవీణ్‌ ప్రకాశ్‌, ధనుంజయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.