క్రిప్టో క‌రెన్సీపై న‌మ్మ‌కంలేని భారతీయులు

భారతీయులలో అత్యధికులు తమకు క్రిప్టో క‌రెన్సీపై న‌మ్మ‌కంలేద‌ని స్పష్టం చేస్తున్నారు.  దేశంలో క్రిప్టో క‌రెన్సీని చ‌ట్ట‌బ‌ద్ధం చేయ‌కూడ‌ద‌ని, విదేశాల్లో క‌లిగివున్న డిజిట‌ల్ అసెట్స్ మాదిరిగా ప‌రిగ‌ణించి ప‌న్నులు విధించాల‌ని కోరుతున్నారు. డిజిట‌ల్ క‌రెన్సీపై భార‌త‌ ప్రభుత్వం నియంత్రణ విధించే దిశలో ఒక బిల్ తీసుకురానున్న నేప‌థ్యంలో చ‌ర్చ‌నీయాంశంగా క్రిప్టో క‌రెన్సీపై  లోక‌ల్ స‌ర్కిల్స్ నిర్వ‌హించిన స‌ర్వేలో   ఆస‌క్తి రేకెత్తించే ప‌లు అంశాలు వెల్ల‌డ‌య్యాయి. 
 
15 రోజుల్లో దేశంలోని 342 జిల్లాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించ‌గా 29,352 మంది భాగ‌స్వాములు పాల్గొన్నారు. స‌ర్వేలో పాల్గొన్న‌వారిలో 71 శాతం మంది క్రిప్టో క‌రెన్సీల‌పై స్వ‌ల్పంగా లేదా అస్స‌లు న‌మ్మ‌కం లేద‌ని చెప్పారు. ఆర్బీఐ నియంత్ర‌ణ‌లో భార‌త్ సొంతంగా రూపొందించ‌బోతున్న క్రిప్టో క‌రెన్సీకి స‌ర్వే భాగ‌స్వాముల్లో 51 శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు. 
 
26 శాతం మంది వ్య‌తిరేకించారు. క్రిప్టో క‌రెన్సీల ప్ర‌క‌ట‌న‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే క్రిప్టో ప్లాట్ ఫామ్స్ ప్ర‌క‌ట‌న‌లు కొన‌సాగించాల‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌భావం చూపుతున్నాయ‌ని, అంత‌గా ప్ర‌భావం చూప‌డంలేద‌ని గ‌ణ‌నీయ సంఖ్య‌లో భాగ‌స్వాములు అభిప్రాయ‌ప‌డ్డారు. 

చాలామంది భారతీయులు  క్రిప్టో కరెన్సీలో  పెట్టుబడి పెట్టినప్పటికీ.. పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ లేకపోవడం పెట్టుబడిదారులకు అధికనష్టాలకు దారితీస్తోంది. 71 శాతంమంది నిపుణులు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని లోకల్‌ సర్కిల్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సచిన్‌ తపారియా తెలిపారు. 

క్రిప్టోకరెన్సీల కారణంగా ఎదురయ్యే నష్టాలను ఫ్లాట్‌ ఫారమ్‌లు, ఎక్సేంచీలపై ప్రకటనలు నష్టాలను హైలెట్‌ చేయడం లేదని తపారియా పేర్కొన్నారు. 76 శాతం మంది నిబంధనలు సిద్ధమయ్యే వరకు ఈ ప్రకటనలను నిలిపివేయాలని కోరినట్లు సర్వేలో తేలింది. 

డిజిటల్‌ కాయిన్‌ల్లో లావాదేవీల విలువ పెరిగినప్పటికీ సుమారు 70 శాతం నుండి 80 శాతం ఖాతాలు (27 డాలర్లు) 2వేల కంటే తక్కువ మొత్తం బ్యాలెన్స్‌గా కలిగి ఉన్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలపడం గమనార్హం. సుమారు 87 శాతం కుటుంబాలకు క్రిప్టోకరెన్సీలో వ్యాపారం చేయడం లేదా పెట్టుబడి పెట్టడం లేదు.

మరోవంక, క్రిప్టో క‌రెన్సీల‌పై పూర్తి నిషేధం విధించ‌డం వ‌ల్ల డిజిట‌ల్ క‌రెన్సీతో చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క్ర‌మాలు పెరిగిపోయే ప్ర‌మాదం ఉంది. క్రిప్టోల‌పై పూర్తి నిషేధం రాజ్యేత‌ర శ‌క్తులు వాటిని మ‌రింత చ‌ట్ట విరుద్ధ కార్య‌క‌లాపాల‌కు వినియోగించే ముప్పు పొంచి ఉంద‌ని ఐఎఎంఏఐ అనుబంధ ఇండ‌స్ట్రీ బాడీ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కౌన్సిల్ (బీఏసీసీ) హెచ్చరించింది. 

గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొందిది. ఐఎఎంఏఐ అంటే ఇంట‌ర్నెట్ అండ్ మొబైల్ అసోసియేష‌న్‌. క్రిప్టో క‌రెన్సీల‌ను కేవ‌లం ఆస్తిగానే ఉప‌యోగించుకునేందుకు అనుమ‌తించాల‌ని సూచించింది. భార‌త్ క‌రెన్సీకి ఆల్ట‌ర్నేటివ్‌గా వాడితే దేవ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధానం, ద్ర‌వ్య నియంత్ర‌ణ‌ల్లో క్రిప్టో క‌రెన్సీల జోక్యం పెరుగుతుంద‌ని బీఏసీసీ వివరించింది.

క‌నుక భార‌తీయులు క‌రెన్సీగా క్రిప్టోల‌ను వాడ‌కుండా చ‌ట్ట‌ప‌రంగా ఆంక్ష‌లు విధించ‌డానికి అనుకూల‌మ‌ని తెలిపింది. కాగా క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ ఆఫీషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్లు 2021 ఈ శీతాకాల పార్ల‌మెంట్ సెష‌న్ లో పార్ల‌మెంట్ ముందుకురానుంది.