
కేరళలోని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నవంబర్ 15న హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ యువకుడు సుజిత్ (27) కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించేందుకు ఇష్టపడకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కేసులో దోషులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రహస్య అజెండా ఉన్నదని ఆరోపించింది.
పట్టపగలు జరిగిన ఈ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) కారణమని ఆరోపిస్తూ, నిందితులకు అధికార పక్షం మద్దతు ఉన్నందున రాష్ట్ర పోలీసులు స్వేచ్ఛగా దర్యాప్తు జరపలేరని బిజెపి స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి వి మురళీధరన్ మంబరంలోని ఆమె పని చేసే ప్రదేశానికి భార్యను తీసుకెళ్తుండగా హత్యకు గురైన 27 ఏళ్ల కార్యకర్త సంజిత్ ఇంటికి వెళ్లి విచారంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కేరళలో సంజిత్ తో పాటు జరిగిన రెండు హత్యలతో తీవ్రవాదులకు సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు.
అలాంటి కేసులను నిర్వహించడంలో నైపుణ్యం ఉన్న ఏజెన్సీ మాత్రమే వాస్తవాలను బయటకు తీసుకురాగలదని ఆయన పేర్కొన్నారు. ‘అందుకే ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ విషయంలో తమకు రహస్య ఎజెండా ఉన్నందున కేసును ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం విముఖత చూపుతోంది’ అని మురళీధరన్ ఆరోపించారు.
నేరస్తుల గురించి మార్క్సిస్ట్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని, వారిని చట్టం ముందు తీసుకురాకుండా వారిని రక్షించడానికి రాష్ట్ర పోలీసులతో కేసును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కేరళలో ‘ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు’ బలపడుతున్నాయని హెచ్చరిస్తూ, ఓట్లకోసం అటువంటి శక్తులకు సిపిఎం, వారి ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయని ఆయన విమర్శించారు.
కేసును ఎన్ఐఏకి అప్పగించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నాయకులు తిరువనంతపురంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కలిశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ నేతృత్వంలో గవర్నర్ కు ఓ వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, సాధారణ పౌరులకు రక్షణ కల్పించడంకోసం గవర్నర్ జోక్యం అనివార్యమని ఈ సందర్భంగా సురేంద్రన్ స్పష్టం చేసారు.
గత సంవత్సర కాలంగా ఎస్డిపిఐ సుజిత్ లక్ష్యంగా చేసుకొని ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు తగు రక్షణ కల్పించలేక పోయారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేక పోయారని అంటూ ఎస్డిపిఐతో పునరాయి విజయన్ ప్రభుత్వం కుమ్మక్కైన్నట్లు స్పష్టం అవుతున్నదని ఆయన ఆరోపించారు.
సుజిత్ హత్యలో ఉగ్రవాదుల ప్రమేయం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేరళలో తన కార్యకర్త హత్యలో “ఉగ్రవాద సంబంధం” ఉందని ఆరోపించింది. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణకు డిమాండ్ చేసింది. నవంబర్ 15న పాలక్కాడ్ జిల్లాలో హత్యకు గురైన సంజిత్ కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం ఆర్ఎస్ఎస్ సహా కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య సిపిఎం ప్రభుత్వం నుంచి న్యాయం జరగని పక్షంలో ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్తను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం “చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయమైనది” అని ఆయన పేర్కొన్నారు. ‘ఉగ్రవాద చర్య’ను ఖండిస్తూ, వైద్య, “మేము మృతుల కుటుంభంకు అండగా దృఢంగా నిలబడతాము” అని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి క్ష్య హత్యలను నిరోధించడంలో విఫలమవడం పట్ల విచారం వ్యక్తం చేయారు.
“స్వయంసేవక్లను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంలో అధికార సిపిఎం, ఇస్లామిస్ట్ శక్తుల మధ్య రహస్య అవగాహన ఉందని” ఆరోపిస్తూ “న్యాయమైన దర్యాప్తు” జరగాలని వైద్య డిమాండ్ చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) “ఉగ్రవాద సంబంధాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాల”పై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.
More Stories
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు
మంగోలియన్ బాలుడిని 3వ అత్యున్నత నేతగా పేర్కొన్న దలైలామా
నేటి నుండే విశాఖలో జీ–20 సదస్సు పట్టణీకరణపై దృష్టి