కాశ్మీర్ ప్రజలను మిగతా దేశంతో కలపాలి 

ఆర్టికల్ 370 ని రద్దు చేయడం వల్ల అనేక అడ్డంకులు తొలగిపోవచ్చని, అయితే “కాశ్మీర్ ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు” ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. 

నాగపూర్‌లో జరిగిన ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, “ప్రస్తుత ప్రభుత్వం ఆర్టికల్ 370, 35 (ఎ) లను రద్దు చేయడానికి సాహసోపేతమైన చర్య తీసుకుంది. దీనిని ఎవరూ ఊహించలేదు. పార్లమెంటరీ చర్చలు, విధానాలను అనుసరించి ఇది జరిగింది. ఇప్పుడు, అభివృద్ధి ప్రయోజనాలు తమకు చేరుతున్నాయని ప్రజలు కూడా చూస్తున్నారు” అని కొనియాడారు. 

 
ఇప్పటికీ కాశ్మీర్ లోయలో ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారని చెబుతూ వారు స్వాతంత్య్రం (భారతదేశం నుండి) మరింత కావాల్సినదిగా భావిస్తున్నారని గుర్తు చేశారు. కాబట్టి, శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడినట్లే – మిగిలిన దేశంతో వారిని కూడా విలీనం చేయడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా, “అధునిక్ లద్దాఖే నిర్మత ఏకోనిసవే కుశోక్ బకులా”, “జమ్మూ కాశ్మీర్: ఐతిహాసిక్ పరిప్రేఖ్మే ధార 370 కే సంశోధన్ కే ఉప్రాంట్” అనే రెండు పుస్తకాలను డా. భగవత్ ఆవిష్కరించారు.

“ఆర్టికల్ 370 అనేది ప్రమాదమేమీ కాదు. కానీ అది నిజమైన ప్రమాదం కలిగించింది. భారతీయ జాతీయతను తమ జాతీయతగా భావించే ఒక చిన్న విభాగం ఉంది. అవినీతి నాయకులు జైలుకు వెళ్లినందుకు పెద్ద విభాగం సంతోషంగా ఉంది. అభివృద్ధికి నాంది పలికినందున ఇది కూడా సంతోషంగా ఉంది, కానీ కాశ్మీర్ స్వతంత్రంగా మారితే మంచిదని ఇప్పటికీ భావిస్తోంది” అని ఆయన హెచ్చరించారు. 

 
మనం భారతీయులం కాకపోతే మనం ఎవరూ కాదనే భావన లేకపోవడం వల్ల కాశ్మీర్ సమస్య తలెత్తిందని ఆయన చెప్పారు. వారు భారతదేశానికి చెందినవారని, భారతదేశం లేనట్లయితే తాము అక్కడ ఉండలేము అనే భావనను వారిలో పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

షేక్ అబ్దుల్లా కాలంలో “బలవంతంపై  కాశ్మీర్ విడిచి వెళ్లిన” వారందరూ తిరిగి రావాలని భగవత్ పిలుపునిచ్చారు. “తాము ఈ దేశానికి చెందిన వారమనే  భావన రెండు వైపుల నుండి ప్రదర్శించబడాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పటి లడఖ్ ఆధ్యాత్మిక నాయకుడు 19 వ కుశోక్ బకులా గురించి మాట్లాడుతూ, సైన్యం దేశం పట్ల తమ విధి నిర్వహిస్తుంటే వారిని సాంకేతిక కారణాలతో బోనులో నిలపెట్టే “మానవ హక్కుల బోగీ” ఉన్నదని విచారం వ్యక్తం చేశారు.  అయితే మనం సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టకుండా, దేశ సమైక్యత, సమగ్రతల కోసం ముందుకు సాగుదామని తెలిపారు. 

 
భారతదేశ ఐక్యత, సమగ్రతకు బాకుల సహకారాన్ని ప్రశంసిస్తూ, పాకిస్తాన్ గిరిజనుల సాయుధ దండయాత్రను తిప్పికొట్టడం కోసం దేశభక్తి గల లడఖి యువకులను ఉత్తేజ పరచడంలో బాకులా కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఎవరూ తనకు అధికారం ఇచ్చే వరకు వేచి ఉండకుండా ఆయన ఒక కర్తవ్యంగా భావించి,  లడఖ్ భారతదేశంలో అంతర్భాగంగా  ఉండాలని కోరుకుంటున్నట్లు అప్పటి సదర్-ఇ-రియాసత్ షేక్ అబ్దుల్లాకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. 
 
అయితే ఆయనను  మంగోలియాకు పంపించారని, మంగోలియా విముక్తి పొందే వరకు ఆయన అక్కడే పనిచేశారని చెప్పారు. దేశంలోనిజాతీయవాదులను వ్యతిరేకించే మంగోలియన్ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆయుధాలను ఉపయోగించకూడదనే బాకుల ఆదేశాలు మనకు స్ఫూర్తి కలిగిస్తాయని తెలిపారు.