అగ్రవర్ణ ప్రజలు టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి?

అగ్రవర్ణ ప్రజలు హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? అని ఓసి సంఘం జాతీయ అధ్యక్షులు పెంజర్ల మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం కల్పించిన ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్లు  టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు కాలయాపన చేసినందుకు లక్షల మంది రిజర్వేషన్ పొందలేక చదువు కోల్పోయినందుకా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసేదని ఆయన నిలదీశారు.
మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో  రిజర్వేషన్ల కుంపట్లో ఉద్యోగాలు దొరకక పరాయి దేశానికి పొట్ట చేత పట్టుకొని పయనం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  తల్లిదండ్రులు భార్య పిల్లలను వదిలి కళ్ళముందు ఉండవలసిన పిల్లలు అన్నమో రామచంద్రా అని కానరాని దేశంలో బ్రతకడానికి అప్పులు  చేసి ప్రయాణం అవుతున్నారని గుర్తు చేశారు.  ఇలాంటివి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కనబడడం లేదా? అని ప్రశ్నించారు.

అగ్రవర్ణ ప్రజలు ఐక్యత లేఖనే కేసీఆర్ విభజించి పాలిస్తున్నారని ఆయన తెలిపారు. అగ్రవర్ణ ప్రజలను మనుషులుగా గుర్తించని  టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వెయ్యాలి? దేనికోసం ఓటు వేయాలి ? అని అడిగారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రవర్ణాలు అంటే చిన్న చూపు అని విమర్శించారు. 

హుజురాబాద్ ఉప ఎన్నికలు రాంగానే దళితులకు రూ 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ అగ్రవర్ణాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటంలేదు అర్ధం చేసుకోవాలని కోరారు. అలాంటి పథకాన్నీ అగ్రవర్ణ పేదలకు ఎందుకు పెట్టకూడదు” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 
 
పది లక్షల రూపాయలు ఇస్తే మన పిల్లలు పరాయి దేశానికి ఎందుకు వెళ్తారు? ఏదో ఒక పని చేసుకొని ఇక్కడే బతుకుతారు కదా? అని గుర్తు చేశారు.  హుజురాబాద్ నియోజకవర్గంలో రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య కులాలకు చెందిన వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని ఆయన పిలుపిచ్చారు. తమను మనుషులుగా గుర్తించని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని స్పష్టం చేశారు.