పవన్ కళ్యాణ్ శ్రమదానానికి అనుమతి నిరాకరణ 

రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఆక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టదలచిన శ్రమదానం కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించారు. పార్టీ కార్యకర్తలను ప్రతి నియోజకవర్గంలో ఆ రోజున శ్రమదానం చేయాలని పిలుపిచ్చింది, పవన్ కళ్యాణ్ తాను స్వయంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీపై, అనంతపురం జిల్లా కొత్తచెరువలో పవన్ శ్రమదానం చేస్తానని ప్రకటించారు.
ఇందుకు సంబందించిన ఏర్పాట్లును జనసైనికులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీపై మరమ్మతులు చేయడానికి వీల్లేదని, గుంతలు పూడిస్తే బ్యారేజీ నష్టమని తెలిపారు. అంతేకాకుండా కాటన్ బ్యారేజీ ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
మరోవైపు జనసేన పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిననా తాము మాత్రం బ్యారేజీపై శ్రమదానం చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు.  పైగా, ఇటీవల రాష్ట్రంలోని రోడ్లను బాగుచేయాలంటూ జనసేన సోషల్ మీడియా ఉద్యమాన్ని కూడా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రోడ్లను మరమ్మతులు చేసేందుకు శ్రమదానం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను కూడా రెండు చోట్ల పాల్గొంటానని ప్రకటించారు.
బద్వేల్ నుండి జనసేన పోటీ 
 
కాగా, క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్‌కు జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తున్నది. తిరుప‌తి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ పోటీ చేసిన కార‌ణంగా ఈసారి బ‌ద్వేల్ నియోజ‌క వ‌ర్గంలో పోటీ చేసే అవ‌కాశం జ‌న‌సేన‌కు ఇచ్చిన‌ట్టు బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌తో పాటుగా రాష్ట్రంలోని తాజా పరిణామాల‌పై కూడా ఇరువురు నేత‌లు చ‌ర్చించారు.