బీజేపీ నేత కిరిట్ సోమయ్య నిర్బంధం

మహారాష్ట్ర బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కిరిట్ సోమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే సర్కారుపై విమర్శలు గుప్పించిన కిరిట్ సోమయ్య మహారాష్ట్ర  మంత్రి హసన్ ముష్రిఫ్ ఆస్తులను సందర్శించేంచేందుకు కొల్హాపూర్ కు బయలుదేరగా ఆయనను కరాడ్ రైల్వేస్టేషనులో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
 
కొల్హాపూర్ జిల్లా అధికార యంత్రాంగం 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో సోమయ్యను, ముంబై పోలీసులు కరాడ్ రైల్వేస్టేషన్ లో అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్లారు.ఈ నెల 20,21 తేదీల్లో కొల్హాపూర్ జిల్లాలో 144 సెక్షన్ విధించినందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశం కారాదని కొల్హాపూర్ జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు.
 
కొల్హాపూర్ జిల్లాలోకి సోమయ్య ప్రవేశించకుండా సర్కారు నిషేధం విధించింది.థాకరే సర్కారుపై విమర్శలు గుప్పించినందుకు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని, వారెంట్, ఆర్డర్ లేకుండా తనను అరెస్టు చేయాలని అనుకుంటున్నారని ఇది చట్టవిరుద్ధమని సోమయ్య ట్వీట్ చేశారు.
 
గతంలో సోమయ్య మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రులు ఛగన్ భుజ్బల్. అనిల్ పరాబ్‌ లపై మనీలాండరింగ్ ఆరోపణలు చేశారు. కిరీట్‌ సోమయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మరో ఇద్దరు మంత్రుల అవినీతిని త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. ఈ ఇద్దరు మంత్రుల్లో ఒకరు శివసేనకు చెందిన నాయకుడని, మరొకరు ఎన్సీపీ నాయకుడని తెలిపారు.