‘గర్వంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో షాంఘై, న్యూయార్క్, లండన్ వంటి అభివృద్ధి చెందిన నగరాలను సైతం ఈ విషయంలో ఢిల్లీ వెనక్కి నెట్టింది. ఢిల్లీలో ప్రస్తుతం చదరపు మైలు (రెండున్న కిలోమీటరు)కు 1826 సీసీ కెమెరాలు ఏర్పాటై ఉన్నాయి. అదే లండన్‌లో 1138, మిగిలిన చోట్ల అంతకంటే తక్కువ ఉన్నాయి” అని కేజ్రీవాల్ తెలిపారు.
అతి తక్కువ సమయంలో శరవేగంగా కృషి చేసి ఈ ఘనత సాధించినందుకు ఇంజనీర్లకు, అధికారులకు ప్రత్యేక అభినందనల తెలిపారు. ఢిల్లీలో మొత్తం 2.8 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఈ బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్య్లూడీ)కి అప్పగించింది. ఈ ప్రక్రియ మొత్తం రెండు దశలుగా జరగనుంది. పీడబ్య్లూడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 2019 డిసెంబర్ నాటికే ఒక లక్ష ఐదు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం పూర్తయింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ టాప్‌లో, లండన్ రెండో స్థానంలో ఉండగా మూడో స్థానం మళ్లీ దక్షిణ భారతదేశానికి దక్కింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రతి చదరవు మైలుకు 609 సీసీ కెమెరాలు ఏర్పాటై ఉన్నాయి. అయితే భారత్‌లోనే ఎంతగానో అభివృద్ది చెందిన నగరంగా, ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబై మాత్రం ఈ జాబితాలో 18వ స్థానంలో ఉండడం గమనార్హం.
More Stories
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత