
వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుమ్ములాటలతో సతమతమవుతోంది. ము
కెప్టెన్ అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నవజోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఆ పార్టీ అధిష్ఠానం జూలైలో నియమించినప్పటి నుండి పార్టీలో కుమ్ములాటలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన సిద్దూ అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా మొదటిరోజు నుండి పావులు కదుపుతున్నారు.
మంగళవారం తాను నిర్వహించిన అసమ్మతిదారుల సమావేశానికి 46 మంది ఎమ్యెల్యేలు హాజరైనట్లు ఎమ్యెల్యే త్రిప్ట్ రాజిందర్ బజ్వా వెల్లడించారు. ఈ సమావేశంలో నలుగురు కెప్టెన్ కేబినెట్‌లో మంత్రులు పాల్గొనడం గమనార్హం. తామంతా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి, ముఖ్యమంత్రిని మార్చమని కోరనున్నట్లు తెలిపారు.
పాకిస్తాన్, కశ్మీర్ అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులను అమరీందర్ టార్గెట్ చేయడాన్ని వారు ఖండిస్తున్నారు. సీఎం అమరీందర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న వారిలో ఎమ్మెల్యేలు.. త్రిప్ట్ రాజిందర్ బజ్వా, సుఖ్జిందర్ సింగ్ రాంధావా, చరణ్‌జిత్ సింగ్ చన్ని, సుఖ్బిందర్ సింగ్ సర్కారియాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పర్గట్ సింగ్‌లు ఉన్నట్లు సమాచారం.
వీరంతా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెస్ అధిష్టానవర్గానికిగల ప్రత్యేక అధికారమని చెప్పారు. అయితే తమకు కెప్టెన్‌పై నమ్మకం పోయిందని స్పష్టం చేశారు.
కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైంని ధ్వజమెత్తారు. పార్టీ కేడర్‌కు తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈ వివరాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేయడం కోసం ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఐదుగురు సభ్యుల బృందానికి బాధ్యతలను అప్పగించారని వెల్లడించారు.
ముఖ్యమంత్రిని మార్చకపోతే పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని రాష్ట్ర మంత్రి బజ్వా తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని వివరించేందుకు సోనియా గాంధీని కలిసేందుకు బయల్దేరుతున్నట్లు తెలిపారు.
చర్యకు బీజేపీ డిమాండ్
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి