జాతీయ రహదారులపై ఇక టోల్ ప్లాజాలే ఉండవు!

రాబోయే రోజులలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలే కనిపించవు.  టోల్ ఫీజు వ‌సూలు చేయ‌డానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వ‌చ్చే మూడు నెల‌ల్లో ఈ మేర‌కు కొత్త విధానాన్ని తీసుకు రానున్న‌ది. ఈ సంగ‌తి కేంద్ర జాతీయ ర‌హదారుల‌శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్లడించారు. 

కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (సీఐఐ) వార్షిక‌ స‌ద‌స్సులో ఆయ‌న ఈ సంగ‌తి చెప్పారు. ఏడాది లోపు పూర్తి స్థాయిలో జీపీఎస్‌తో కూడిన టోల్ వ‌సూళ్ల వ్య‌వ‌స్థ అమ‌లులోకి వ‌స్తుంద‌ని కేంద్ర‌మంత్రి తెలిపారు. ఇప్ప‌టికైతే జీపీఎస్ ఆధారిత టోల్ వ‌సూళ్ల టెక్నాల‌జీ ప్ర‌భుత్వం వ‌ద్ద అందుబాటులో లేద‌ని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

త్వ‌ర‌లో టోల్ ప్లాజాల వ‌ద్ద టోల్ బూత్‌ల‌ను తొల‌గిస్తామ‌ని గ‌త మార్చిలో నితిన్ గడ్క‌రీ వెల్ల‌డించారు. ఖ‌ర్చును అదుపు చేయ‌డానికి రోడ్ల నిర్మాణంలో సిమెంట్‌, స్టీల్ వాడ‌కం త‌గ్గించాల‌ని రోడ్డు నిర్మాణ సంస్థ‌ల‌ను నితిన్ గ‌డ్కరీ కోరారు. రోడ్ల నిర్మాణంలో ఖ‌ర్చు త‌గ్గించ‌డానికి నూత‌న ఆలోచనల‌తో ముందుకురావాల‌ని క‌న్స‌ల్టెంట్ల‌ను ఆయన అభ్య‌ర్థించారు.

జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణించే వాహ‌నాల‌పై జీపీఎస్ ఇమేజింగ్ ఆధారంగా టోల్ వ‌సూల్లు జ‌రుగుతాయి. ఏడాది లోపు దేశ‌వ్యాప్తంగా టోల్ ప్లాజాల వ‌ద్ద టోల్ బూత్‌లు తొల‌గిస్తామ‌ని లోక్‌స‌భ‌లో నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు. వాహ‌నాల‌పై జీపీఎస్ ఇమేజింగ్ ఆధారంగా టోల్ ఫీజు వ‌సూలు చేస్తామ‌ని పేర్కొన్నారు.

నూత‌న జీపీఎస్ ఆధారిత టోల్ వ‌సూళ్ల వ్య‌వ‌స్థ ర‌ష్యాకు చెందిన టెక్నాల‌జీ. దీని ప్ర‌కారం వాహ‌నం ప్ర‌యాణించిన దూరాన్ని బ‌ట్టి.. ఆ వాహ‌నం ఈ-వాలెట్ లేదా వాహ‌న య‌జ‌మాని ఖాతా నుంచి టోల్ ఫీజు డిడ‌క్ట్ అవుతుంది. ఈనాడు ప్యాసింజ‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌న్నీ గ్లోబ‌ల్ పొజిష‌నింగ్ సిస్ట‌మ్ (జీపీఎస్‌)తో అనుసంధాన‌మై ఉన్నది.

అయితే, పాత వాహనాల‌తో జీపీఎస్‌ను అనుసంధానించ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఫాస్టాగ్‌తో ఎల‌క్ట్రానిక్ టోల్ వ‌సూళ్ల వ్య‌వ‌స్థ అమ‌లులో ఉన్న‌ది. దీన్ని భార‌త జాతీయ ర‌హ‌దారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్వ‌హిస్తున్న‌ది. వాహ‌నాల‌ విండ్ స్క్రీన్‌పై ఫాస్టాగ్ లోగో పేస్ట్ చేసి ఉంచుతారు.

క‌నుక కారు డ్రైవ‌ర్లు బూత్ వ‌ద్ద నిలిచి టోల్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. స‌ద‌రు టోల్ బూత్ మీదుగా వాహ‌నం వెళ్లిన‌ప్పుడు స‌ద‌రు వాహ‌న‌దారుడి బ్యాంక్ ఖాతా నుంచి న‌గ‌దు డిడ‌క్ట్ అవుతుంది.