“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” చిత్రం యూనిట్ పై ఫిర్యాదు

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనతో బెడ్ రూమ్ సన్నివేశాలు అసభ్యంగా చిత్రీకరించి, శ్రీ కృష్ణ పరమాత్మను, తులసి మాతను కించపరిచేలా సన్నివేశాలు,   డైలాగులు పెట్టి హిందువుల విశ్వాసాలను గాయపరుస్తూ “ఇప్పుడు కాక ఇంకెప్పుడు ” చిత్ర ట్రయల్ ను యూ ట్యూబ్ లో విడుదల చేయడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత , నటీనటులు, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, బిజెపి మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ లు వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా రెండు లిఖిత పూర్వక ఫిర్యాదులు అందజేశారు.

ఈనెల 6వ తేదీన చిత్రం విడుదల అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషద్ హెచ్చరించింది. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు ను ప్రక్షాళన చేయాలని  డిమాండ్ చేసింది. వనస్థలిపురం సిఐ మురళీమోహన్ వారి ఫిర్యాదులను స్వీకరించారు.