మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గం యోగా

ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు. దీనిద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చని తెలిపారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల శాంతి, సామరస్యం పెరుగుతాయని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఢిల్లీలోని తన నివాసంలో సతీమణి ఉషతో కలిసి యోగా సాధన వేశారు.

కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. దీంతో వ్యక్తిగతంగా తద్వారా సమాజంలో శాంతి సామరస్యాలు, సుహృద్భావ వాతావరణం నెలకొంటాయని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

అంర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనాలు వేశారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. 

 అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా అమెరికాలోని న్యూయార్క్ మొద‌లుకొని మ‌న‌దేశంలోని ల‌ధాక్ వ‌ర‌కూ ప్ర‌జ‌లు యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.  మ‌న‌దేశంలోని గాల్వాన్ లోయ, లధాక్‌లోని 18 వేల అడుగుల ఎత్తయిన ప‌ర్వ‌త శ్రేణిపై ఐటీబీపీ సైనికులు యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. లఢక్‌లోని పాంగాంగ్‌ టీఎస్‌ఓ సరస్సు వద్ద ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసు (ఐటీబీపీ)లు యోగాసనాలు వేశారు.

అత్యంత చ‌లి ప్ర‌దేశంలోనూ యోగా  చేస్తుండ‌టం కార‌ణంగా తాము ఆరోగ్యంగా ఉన్నామ‌ని వారు సందేశ‌మిచ్చారు. అమెరికాలోని న్యూయార్క్‌లోగ‌ల టైమ్ స్క్యేర్ వ‌ద్ద  యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మూడు వేల‌మంది అమెరిక‌న్లు పాల్గొన్నారు.కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, న్యూయార్క్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  మ‌న‌దేశంలోని హ‌రిద్వార్‌లో యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆధ్వ‌ర్యంలో యోగా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తోథిపూర్‌లో ఉన్న యానిమల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ (ఏటీఎస్‌)లో గుర్రాలపై ఐటీబీపీ సైనికులు ఆసనాలు వేశారు. గల్వాన్‌లో, లఢక్‌లో 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద సైనికులు యోగా సాధన చేశారు.