శాంతి భద్రతలు, పట్టించుకోని మమతా

గత నెలలో ఎన్నికల ఫలితలు విడుదలైన నాటి నుండి పశ్చిమ బెంగాల్ లో హింస మీతిమీరీ పోతున్నది. అధికార టి‌ఎం‌సికి వ్యతిరేకంగా ఉన్నారనే కక్షతో బి‌జే‌పి, కమ్యూనిస్ట్ నాయకుల, కార్యకర్తల ఇండ్లపై దాడి చేసి ఒక భయానక వాతావరణాన్ని ఏర్పరిచారు. రాష్ట్రం లో చట్ట వ్యతిరేక జిహాది ఎలాంటి అడ్డు అదుపులేనట్టు వరుస సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇప్పటి వరకు 40 మందికి పైగా బి‌జే‌పి కార్యకర్తలు హత్యకు గురి అయ్యారు, కొన్ని వందల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఎంతో మంది తమ ఇండ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళుతున్నారు.

తాజాగా  హూగ్లీ లో హిందువూల ఇండ్లపై దాడి జరిగింది. ఈ పరిస్థితి పై స్వయంగా అక్కడి రాష్ట్ర గవర్నర్, బి‌జే‌పి నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలియ చేస్తున్నారు.

టి‌ఎం‌సి గుండాల దాడిలో గాయపడిన ఒక డాక్టర్ ను  బి‌జే‌పి ఎంపీ పరామర్శించడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఇంత జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , పోలిసు యంత్రాంగం శాంతి భద్రతల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం.