బింద్రన్ వాలేను కీర్తిస్తూ హర్భజన్ సింగ్ పోస్ట్

దేశంలో సిక్కుల వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్ర‌న్ ‌వాలేను కీర్తిస్తూ  “గర్వంగా జీవించండి, మతం కోసం మరణించండి” అంటూ ఉన్న ఫోటోను మాజీ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ త‌న ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ 37వ వార్షికోత్సవం సందర్భంగా ‘అమరవీరుడుకి ప్రణమ్’ అంటూ పోస్టు చేయ‌డం వివాద‌స్ప‌దంగా మారింది.

అమృత్ స‌ర్‌లోని  శ్రీ హర్మాండిర్ సాహిబ్ లోపల జరిగిన కార్యక్రమంలో భీంద్రాన్‌వాలే, ఖలీస్తాన్ జెండాల పోస్టర్లు కూడా కనిపించాయి. ఖలీస్తాన్ అనుకూల బృందం దాల్ ఖల్సా కూడా జూన్ 6 న ‘ఖలీస్తాన్ దినోత్సవం’ గుర్తుగా కవాతు కూడా నిర్వహించింది.

దీంతో దేశవ్యాప్తంగా క్రికెటర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ తీరు ప‌ట్ల నెటిజ‌న్ల నుంచి నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో చివ‌రికి అత‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఖలీస్తానీ వేర్పాటువాది బింధ్ర‌న్‌‌వాలే  వివాదాస్పదమైన పోస్ట్ చేసి దేశవాసుల మనోభావాలను దెబ్బతీశానని అంగీకరిస్తూ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. వాట్స‌ప్‌లో వ‌చ్చిన దాన్ని పూర్తిగా ప‌రిశీలించ‌కుండా ఇన్‌స్టాలో తొందరపడి ఈ పోస్ట్ చేసిన‌ట్టు హ‌ర్బ‌జ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు.

 

ఆపరేషన్ బ్లూ స్టార్ :

1984, జూన్ 1 నుంచి 8 వ‌ర‌కు అమృత్‌స‌ర్ లో ఉన్న‌ స్వర్ణ దేవాలయం లో “ఆపరేషన్ బ్లూ స్టార్” జరిగింది. ఇది భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద అంతర్గత భద్రతా మిషన్. పంజాబ్‌లోని శాంతిభద్రతల పరిస్థితికి పరిష్కారంగా అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ దీనిని ఆదేశించింది.

ఆపరేషన్ బ్లూ స్టార్ నేప‌థ్యంలో ఖలీస్తాన్ మద్దతుదారులు అమృత్‌స‌ర్, గోల్డెన్ టెంపుల్ లోని అకల్ తఖ్త్ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ స‌మ‌యంలో 83 మంది భారతీయ ఆర్మీ జవాన్లు, 492 మంది పౌరులు మ‌ర‌ణించిన‌ట్టు అధికారిక నివేదికల చెబుతున్నాయి. కొన్ని నెలల తరువాత 1984 అక్టోబర్ 31న ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డ‌ల‌ను హత్య చేశారు. ఇది భారతదేశంలో పెద్ద ఎత్తున సిక్కు వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు సిక్కులకు వ్యతిరేక కార్య‌క‌లాపాలు కొన‌సాగించారని ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి.