నిక్లోసమైడ్” క్లినికల్ ట్రయల్స్  ప్రారంభించిన సి.ఎస్.ఐ.ఆర్ 

కొవిడ్ చికిత్స కోసం ఇప్ప‌టిదాకా స‌రైన డ్ర‌గ్‌లేదు. ఇంకా ప‌లురకాల డ్ర‌గ్స్‌పై ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా, నిక్లోస‌మైడ్ అనే ఔష‌ధంపై దేశంలోనే అతిపెద్ద ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్‌) క్లినికల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించిన‌ట్లు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది.

“పున‌ర్నిర్మించిన నిక్లోస‌మైడ్‌ డ్ర‌గ్‌పై సీఎస్ఐఆర్ ఇండియా, ల‌క్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించాయి.” అని కేంద్ర‌ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

కొవిడ్ చికిత్స‌లో ఈ డ్ర‌గ్ స‌మ‌ర్థ‌త‌, సేఫ్టీని ప‌రిశీలించేందుకు రెండుద‌శ‌ల్లో బ‌హుళ విధానంతోపాటు ర్యాండ‌మ్‌, ఓపెన్ లేబుల్ క్లినిక‌ల్ అధ్య‌య‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కాగా, నిక్లోస‌మైడ్ డ్ర‌గ్‌ను పెద్ద‌లు, పిల్ల‌ల్లో టేప్‌వార్మ్ (ఏలిక‌పాములు) సంక్ర‌మ‌ణ చికిత్స కోసం విస్తృతంగా ఉప‌యోగించేవార‌ని పేర్కొంది. ఇది త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన ఔష‌ధ‌మ‌ని సీఎస్ఐఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ శేఖ‌ర్ మండే తెలిపారు.

ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల చికిత్స కోసం “నిక్లోసమైడ్” సమర్థత, భద్రత ను అంచనా వేయడానికి, మల్టీ-సెంట్రిక్, ఫేజ్-2, రాండమైజ్డ్, ఓపెన్ లేబుల్ క్లినికల్ అధ్యయనంలోభాగంగా ఈ పరీక్షలు చేపట్టారు. పెద్దవాళ్లలో,పిల్లల్లో చికిత్స కోసం నిక్లోసమైడ్ గతంలో విస్తృతంగా ఉపయోగించారు. .

“నిక్లోసమైడ్” ఉపయోగించి రెండవ దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఎస్.ఈ.సి. సిఫారసులపై సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే, సంతోషం వ్యక్తం చేశారు.ఇది అందుబాటు ధరలో ఉండే ఔషధం భారతదేశంలో లభిస్తుంది.అందువల్ల మన జనాభాకు అందుబాటులో ఉంచవచ్చునని ఆయన తెలిపారు.