యోగి ఆదిత్యనాథ్ కోవిద్ ఎదుర్కొన్న తీరు అసమాన్యం 

మరో కొద్దీ నెలల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ జరుగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంఘటన) బి ఎల్ సంతోష్ నేతృత్వంలో ఒక అత్యున్నత బృందం రెండు రోజులపాటు లక్నోకు వచ్చి, ముంఖ్యమంత్రి నుండి పలువురు మంత్రులు, ఎమ్యెల్యేలు, పార్టీ నేతలతో భేటీలు జరపడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి కలిగించింది. 

ఇతంతా కరోనా యాజమాన్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరుపట్ల పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో కధనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి మార్పు విషయం కూడా చర్చిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. 

మాజీ కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జ్ రాధా మోహన్ సింగ్ మాత్రం రాష్ట్రంలోని కోవిడ్ యాజమాన్యంను “అసమానమైనది” అని ప్రశంసించారు. తమ  వారి సమావేశాల ఉద్దేశ్యం “మా పార్టీ  చేసిన సామాజిక కార్యక్రమాలను సమీక్షించడం”, కరోనా మూడవ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున తగు ప్రణాళిక రూపొందించడం కోసమే అని స్పష్టం చేశారు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి కాదని తేల్చి చెప్పారు. 

  “ఐదు వారాల్లో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ లో కొత్త రోజువారీ కరోనా  కేసుల సంఖ్యను 93% తగ్గించింది… ఇది 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మున్సిపాలిటీ వంటి 1.5 కోట్ల జనాభాలు గల రాష్ట్రాల ముఖ్యమంత్రులుపరిస్థితులను సరిగా నిర్వహించలేని సమయంలో యోగిజీ చాలా సమర్థవంతంగా నిర్వహించగలిగారు” ”అని బి ఎల్ సంతోష్ తన పర్యటన ముగింపు సందర్భంగా ఒక ట్వీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. .

2017లో ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా యుపీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి అత్యున్నత సమావేశాలు లక్నోలో జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

తమ పార్టీ ప్రతి నెలలో రెండు సార్లు ఇటువంటి సమీక్ష సమావేశాలు జరుపుతూ ఉంటుందని, అయితే ఈ పర్యాయం కోవిద్ కార్యాణంగా కొంతకాలంగా జరుపలేక పోయామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ తెలిపారు. ఈ సమావేశాలలో ఎటువంటి అసాధారణం అంటూ లేదని స్పష్టం చేశారు. 

బి ఎస్ సంతోష్ పార్టీ సంస్థాగత వ్యవహారాలను చూస్తుంటారు. అందుకనే ఆయనతో ప్రధానంగా సంస్థాగత అంశాలపైననే సమాలోచనలు జరిపామని మరో ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య తెలిపారు. వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం గల 403 సీట్లలో 300కు పైగా సీట్లను తిరిగి గెలుచుకోవడం కోసం ఏ విధంగా చేయాలో చర్చలు జరిగాయని చెప్పారు.

కోవిడ్ నిర్వహణ, పరిష్కారాల గురించి నాయకులు తనతో మాట్లాడారని, పార్టీ ప్రజలను మరింత సమర్థవంతంగా ఎలా చేరుకోగలదని కూడా చర్చించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు రాష్ట్రంలో బిజెపి నాయకత్వం మార్పు గురించి మీడియాలో వస్తున్న కధనాల గురించి ప్రశ్నించగా అదంతా ఊహాగానాలే అని రాధా మోహన్ సింగ్ కొట్టిపారేసారు.

“సాధారణంగా, బిజెపి సమీక్ష సమావేశాలు నెలకు రెండుసార్లు జరుగుతాయి, కాని ఈసారి కోవిడ్ -19 కారణంగా అంతరం ఉంది. ఈ మహమ్మారి అందరి నియంత్రణకు మించినది. అయినప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముఖ్యమంత్రి పని మెరుగ్గా ఉంది. మహమ్మారి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పని అసమానమైనది ”అని తెలిపారు. 

సంతోష్ కలిసిన మంత్రులలో ఒకరైన కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్నందున కేడర్,  ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం గురించి చర్చలు జరిగాయని, ఏ వ్యక్తి గురించి అభిప్రాయాలు సేకరించడం జరగలేదని స్పష్టం చేశారు. “ఏ ప్రత్యేక వ్యక్తికి సంబంధించి సమాచారం తీసుకోలేదు.  2022 లోతిరిగి పార్టీ  విజయం కోసం సంస్థ, ప్రభుత్వం మధ్య మంచి సమన్వయం కోసం లక్ష్యాన్ని నిర్ధేశించారు” అని పేర్కొన్నారు.