
ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం, తక్షణం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దర్యాప్తుకు ఆదేశించడం, ఆయనను మంత్రివర్గం నుండి తొలగించడం – అంతా నాటకీయంగా 48 గంటలలో జరిగి పోయింది.
ఇప్పుడు అదే రీతిలో ఈటెల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో, ఆయన తక్షణం దర్యాప్తుకు ఆదేశించారు. మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి నితిన్ రెడ్డి కబ్జాలపై సీఎంకు ఫిర్యాదు అందించారు.
తన భూమిని నితిన్‌రెడ్డి చెర నుంచి రక్షించి తనకు న్యాయం చేయాలని మహేశ్ దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం సూచించారు. వహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అవినీతి నిరోదకశాఖ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు.
More Stories
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్
బనకచర్ల వివాదంపై త్వరలో ఇద్దరు సీఎంలతో భేటీ