రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడిందన ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ధరను నిర్ణయించి, కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని, రవాణా ఖర్చులను రీయింబర్స్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు గణాంకాలపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయని, ఇది రైతులను తప్పుదారి పట్టించడమేనని రాంచందర్ రావు పేర్కొన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటకు కూడా ఇదే దుస్థితి పట్టిందని, జమ్మికుంటతో పాటు అనేక మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి మార్చి 23 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించిందని, ఈ జాప్యం కారణంగా లారీల కొరత, గన్నీ బ్యాగుల సరఫరాలో లోపాలు ఏర్పడ్డాయని తెలిపారు. అకాల వర్షాల సమయంలో రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా రీయింబర్స్ చేస్తోంది. అయితే కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
మార్క్ ఫెడ్ ద్వారా కేంద్ర నిధులతో వీటిని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవ్వడమే కాకుండా, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, జిల్లా కలెక్టర్లు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల గోసను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి, రైతులను ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
More Stories
కాంగ్రెస్ ది దగా ప్రభుత్వం.. రైతుల ఆక్రందనలు వినబడట్లేదా?
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన
కాజీపేట రైల్వే యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ