రఘురామకృష్ణరాజుకు `సుప్రీం’ బెయిల్

 నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. 
 
గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.  అయితే, దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని, ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతులు విధించింది.
అదే విధంగా, గతంలో చూపించినట్లు తన గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని తెలిపింది.  చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కండీషనల్ బెయిల్‌ను మంజూరు చేసింది. తొలుత ఉదయం, ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు.  ‘కాళ్లకు గాయాలున్నట్లు నివేదికలో ఉంది. కాలిలో ఎముక విరిగిందని నివేదికలో ఉంది’ అని వినయ్ స్పష్టం చేశారు. దానితో, రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది.
 దేశ‌ద్రోహం కేసులో వైసీపీ న‌ర్సాపురం ఎంపీని సీఐడీ పోలీసులు వారం రోజులక్రితం అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను సీఐడీ పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేశార‌ని పేర్కొంటూ బెయిల్ కోరుతూ ఎంపీ నేరుగా సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సుప్రీం ఆదేశానుసారం రాఘురామ‌కృష్ణ‌రాజుని ఆర్మీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది. ఎంపీకి జనరల్‌ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు. ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది.

అందుకే తాము బెయిల్ కోరుతున్నామని రఘురామ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాదు.. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముకుల్ రోహిత్గీ కోర్టును కోరారు.  మెడికల్‌ బోర్డు రిపోర్ట్‌కి, ఆర్మీ ఆస్పత్రి చెకప్‌కి మధ్య ఏదో జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే అనుమానం వ్యక్తం చేశారు. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్‌లో తేలిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు.