ఆదాయం పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును మరో నాలుగు నెలలు ప్రభుత్వం పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల దృష్టా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
కంపెనీలకు కూడా రిటర్నుల దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్ వైరస్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిడిటి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) పేర్కొంది.
వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్ 31గా సిబిడిటి గడువు ఇచ్చింది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది. ఐటి రిటర్న్‌ల దాఖలును సులభం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
జూన్ 7న కొత్త ఇ-ఫైలింగ్ వెబ్ పోర్టల్
వచ్చే నెల 7న పన్ను చెల్లింపుదారులకు కొత్త ఆదాయ పన్ను ఇ ఫైలింగ్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు ఐటి శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిని ఐటిఆర్ ఫైలింగ్, ఇతర పన్ను సంబంధిత పనులకు ఉపయోగించవచ్చు. కొత్త పోర్టల్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వెబ్ పోర్టల్ జూన్ 1 నుండి జూన్ 6 వరకు మూసివేస్తారు.
పాత పోర్టల్ నుండి కొత్త పోర్టల్‌కు వెళ్ళే పనులు పూర్తవుతాయని, జూన్ 7 నాటికి ఇది అమలులో ఉంటుందని డిపార్ట్‌మెంట్ సిస్టమ్ వింగ్ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను తీసుకొచ్చింది. జూన్ 7 నుంచి ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఫిర్యాదు పరిష్కారానికి జూన్ 10 తర్వాత తేదీని నిర్ణయించాలని ఈ ఉత్తర్వు అధికారులను సూచించింది.
రూ.24,792 కోట్ల రిఫండ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే 17 వరకు 15 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ .24,792 కోట్ల టాక్స్ రిఫండ్స్ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ మొత్తంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్ మొత్తం రూ.7,458 కోట్లు, కంపెనీ పన్ను కింద రూ .17,334 కోట్లు రిఫండ్స్ చేశారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 17 వరకు 15 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు సిబిడిటి రూ.24,792 కోట్ల రిఫండ్స్ చేసిందని ఐటి శాఖ తెలిపింది.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు