చైనా ధోరణిపైననే ద్వైపాక్షిక సంబంధాలు… భారత్ స్పష్టం

చైనా ధోరణిపైననే ద్వైపాక్షిక సంబంధాలు… భారత్ స్పష్టం

భారత్, చైనా మధ్య సంబంధాలు అదకత్తెరలో ఉన్నాయని పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సరిహద్దులో శాంతిని నెలకొల్పడానికి గతంలో చేసుకున్న వివిధ ఒప్పందాలకు బీజింగ్ కట్టుబడి ఉందా అనే దానిపై ద్వైపాక్షిక సంబంధాల దిశ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పాంగోంగ్ త్సోలో మొదటి అడుగు తరువాత, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు వెంబడి విస్తరణ ఇంకా జరగలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే చెప్పిన ఒక రోజు తర్వాత ఆయన  ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్-ఫైనాన్షియల్ టైమ్స్ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ: “ఈ సంబంధం ఒక ఆడకత్తెరలో ఉందని నేను భావిస్తున్నాను.  మనం ఏ దిశలో వెళ్తామో? చైనా పక్షం ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉందా?  గతంలో దశాబ్దాలుగా  చేసుకున్నఒప్పందాలను అనుసరిస్తుందా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

ఎందుకంటే గత సంవత్సరంలో చాలా స్పష్టంగా తెలిపింది ఏమిటంటే, సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనగా ఇతర ప్రాంతాలలో సహకారంతో కొనసాగలేవని తేల్చి చెప్పారు. గత జనవరిలోనే  ఇరు దేశాలు “నిజంగా ఆడకత్తెరలో ఉన్నాయి” అని జైశంకర్ పేర్కొనడం గమనార్హం.  చైనాతో సంబంధాల మెరుగుదలకు ఆయన ఎనిమిది విస్తృత సూత్రాలను, మూడు “మ్యూచువల్స్” ను ప్రతిపాదించారు.

1962 యుద్ధం తరువాత, 26 సంవత్సరాల తరువాత అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ బీజింగ్ వెళ్లి, సరిహద్దు వద్ద శాంతిని నెలకొల్పడానికి ఒక అవగాహనను ఏర్పరచుకున్నప్పుడు చైనా “1988 ఏకాభిప్రాయం” నుండి బయలుదేరిందని కేంద్ర మంత్రి చెప్పారు.  “ఇప్పుడు, మీరు శాంతి,  ప్రశాంతతకు భంగం కలిగిస్తే, మీరు రక్తపాతం కలిగిస్తుంటే,  బెదిరింపులకు  పాల్పడుతుంటే, సరిహద్దులో నిరంతర ఘర్షణలకు దిగుతుంటే”, ఇది స్పష్టంగా రెండు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తుందని విదేశాంగమంత్రి తేల్చి చెప్పారు.

సరిహద్దులో శాంతిని నెలకొల్పడంపై 1993, 1996 లలో రెండు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని జైశంకర్ సూచించారు. సరిహద్దులలో స్థిరత్వం అనేక రంగాలలో సంబంధాల విస్తరణకు దారితీసిందని, అయితే తూర్పు లడఖ్‌లో జరిగిన దాని తరువాత ఇది ప్రతికూలంగా ప్రభావితమైందని ఆయన పేర్కొన్నారు.
సరిహద్దుల్లో పెరుగుతున్న చైనా ఉనికిని ప్రస్తావిస్తూ “పరస్పరం పోటీ పడటం ఒక విషయం. కానీ సరిహద్దుల్లో హింసకు దిగడం మరో అంశం. రెండింటి మధ్య చాలా తేడా ఉంది” అని తెలిపారు. “భారత్ ఒక చిన్న దేశం కాదు. మాకున్న సామర్ధ్యాలను మాకున్నాయి. పౌరుడు దేశాలతో మాకు ఎక్కువగా సాంస్కృతిక సౌలభ్యం, సహజమైన సంబంధాలు, సామజిక పరిచయాలు ఉన్నాయి” అని గుర్తు చేశారు.
“కేవలం మా పరిసరాలలోని కాకూండా, అంతకు మించి కూడా మా సంబంధాలు విస్తరించి ఉన్నాయి. ఒక వైపు ఇండో -పసిఫిక్ లో, ఆఫ్రికాలో, మరోవైపు ఐరోపాలో మా అనుబంధాలు విస్తరించి ఉన్నాయి. కాబట్టి మేము పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అది సమస్య కాదు. మన సంబంధాల ఆధారాన్ని ఒక వైపు ఉల్లంగించినట్లయితే మెరుగైన సంబంధాలను ఎలా నిర్వహించగలం?” అని జైశంకర్ ప్రశ్నించారు.
1980,  1990 లలో సరిహద్దును స్థిరీకరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇతర రంగాలలో ఆర్థిక సంబంధాలు, ఇతర రంగాలలో కూడా  సంబంధాలు మెరుగైన్నట్లు విదేశాంగ మంత్రి గుర్తు చేశారు.