దేశంలో మరికొన్ని కంపెనీలు టీకాలపై పరిశోధనలు జరుపుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నా రు. రష్యాకు చెందిన స్పుత్నిక్ టీకాను దేశంలో సరఫరా చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. వచ్చే జూలై నాటికి 39.9 కోట్ల కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు.
మేలో 10 కోట్లు, జూన్‌లో 11 కోట్లు, జూలైలో 14.8 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీటికి అదనంగా వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నుంచి మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఆగస్టులో 30-35 కోట్లు, సెప్టెంబరులో 45-50 కోట్లు, అక్టోబరులో 46-51 కోట్లు, నవంబరులో 53.5-58.5 కోట్లు, డిసెంబరులో 55.5-60.5 కోట్ల వంతున మొత్తం 255 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు.
ఇవికాకుండా మరో ఐదు కంపెనీల వ్యాక్సిన్లు పరిశోధనలో ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన బయోలాజిక్ ఈవెంట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ మధ్య ఒప్పందాలు చేసుకుని, టెక్నాలజీ బదిలీ పూర్తయితే నెలకు 5 కోట్ల టీకాలు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్ అయినా మన దేశంలో ఉత్పత్తికి దరఖాస్తు చేసిన రెండు రోజులు లేదా 24 గంటల్లోపే అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు చెప్పా రు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ కంపెనీల వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం సంప్రదింపులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 18 కోట్ల మందికి పైగా ఉచితంగా టీకాలు వేసినట్లు తెలిపారు.
More Stories
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం
విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు