
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మంథనిలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గొనే బహిరంగసభ కొద్ది సేపట్లో జరుగుతోందని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. అలానే కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరుగవలసిన భారీ బహిరంగ సహితం భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.
జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి ఈదురుగాలులతో పలుచోట్ల వాన కురిసింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కురువగా.. అత్యధికంగా వేంసూర్‌లో మోస్తరు వర్షాపాతం రికార్డయ్యింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలు.. కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వాన కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, కాగజ్‌నగర్, కౌటాలా, సిర్పూర్(టీ) భారీ వర్షం కురిసింది. ఇదిలా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో చల్లబడిన వాతావరణం చల్లబడింది.
జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మతో పాటు మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వానపడింది. మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్లు కురిశాయి. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోనూ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పొద్దంతా ఎండ దంచికొట్టగా.. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రాబోయే గంటలో సమయంలో నార్త్ హైదరాబాద్‌లో వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
More Stories
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో సంక్షోభంలో పాకిస్తాన్!