సత్యం, సైన్స్ లతోనే కోవిద్ మహమ్మారిపై పోరు 

పారిశ్రామికవేత్త మరియు పరోపకారి అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ, కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సత్యం, సైన్స్ పునాదిగా పోరాటం చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత అజీమ్  ప్రేమ్‌జీ  పిలుపిచ్చారు. మహమ్మారి యొక్క స్థాయి,   వ్యాప్తిని నిజాయితీగా అంగీకరించాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు.
రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు సంబంధించి జరిగిన  “పాజిటివిటీ అన్‌లిమిటెడ్” ప్రసంగాల కార్యక్రమంలో భాగంగా రాజ్య‌స‌భ టెలివిజన్, దూరదర్శన్ లలో ప్రసారం చేసిన ప్రసంగంలో ప్రేమ్‌జీ మాట్లాడాడుతూ  వీటి వ‌ల్ల‌నే భ‌విష్య‌త్‌లో పున‌రావృతం కాకుండా చూసుకోవ‌చ్చని చెప్పారు.

విప్రో వ్యవస్థాపకుడు ప్రేమ్‌జీ మాట్లాడుతూ, “మొదట, మనం అన్ని రంగాల్లో వేగంగా వ్యవహరించాలి, ఈ చర్యలన్ని మంచి సైన్స్ పై ఆధార పడాలని ఆయన తెలిపారు.  వాస్తవానికి సైన్స్ మీద ఆధారపడని చర్యలు కారణంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుత పరిస్థితులలో భార‌తీయులం అంతా క‌లిసి ఉండి ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవాల‌ని ఆయన స్పష్టం చేశారు.  మ‌నమంతా క‌లిసి ఉంటే బ‌ల‌ప‌డ‌తాం.. విడిపోతే క‌ష్టాలు ఎదుర్కొంటాం అనే సామెత‌ను మ‌రిచిపోవ‌ద్ద‌ని హితవు చెప్పారు. దేశం ఒక‌టిగా ఉండాలి, ఈ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు మ‌న‌మంతా తేడాల‌ను వ‌దిలి ఐక్యంగా ఉండాల‌ని హితవు చెప్పారు. 

ఇదే సమయంలో జనాభాలో ఆర్థికంగా బలహీన వర్గాలను ఆదుకోవడానికి  అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. “మనం బాగా అణగారిన వర్గాల దుస్థితిపై పూర్తిగా దృష్టి పెట్టాలి … మన  చర్యలన్నీ బలహీనంగా ఉన్నవారికి చేయూత ఇచ్చే విధంగా ఉండాలి” అని సూచించారు. ప్రస్తుత పరిస్థితిని “హృదయ విదారకం”గా ఉన్నదని పేర్కొంటూ  , “మనం గ్రామాలను, పేదరికంలో ఉన్నవారిని చూస్తే, అది మహమ్మారి మాత్రమే కాదు, ప్రజల జీవితాలను నాశనం చేసే ఆర్థిక సంక్షోభం కూడా” అని చెప్పారు.
దేశంలో మరింత సమాన సమాజాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని వాదించిన తెలుపుతూ, ఈ సంక్షోభం నుండి దేశం బయటకు రాగానే, మన దేశానికి ఈ రకమైన అసమానత,  అన్యాయం లేని విధంగా మన సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపిచ్చారు. “నేటి పరిస్థితుల అత్యవసరాన్ని పరిగణలోకి తీసుకొని మనలో ప్రతిఒక్కరూ కలిసి వచ్చి, మనం చేయగలిగినదంతా,  అంతకంటే ఎక్కువ చేయమని కోరుతున్నాను” అని ఆయన తెలిపారు.

ఈ ప్రసంగాల కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, ఈ సంక్షోభ సమయంలో దేవుణ్ణి స్మరించుకోవాలని, ప్రతికూల సమాచారం రాకుండా ఉండాలని ప్రజలను కోరారు. మహమ్మారి గురించి టీవీ వార్తలపై దృష్టి పెట్టవద్దని ప్రజలకు సలహా ఇస్తూ, “మనం ప్రతికూల మనస్తత్వం,  ప్రతికూల విషయాలను నివారించాలి. ప్రతికూల విషయాలు వీలైనంత వరకు తగ్గించాలి ” అని హితవు చెప్పారు.

కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశాన్ని ఉద్దేశించి భారతీయ సమాజం లోని ముఖ్య వ్యక్తులు మే 11 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రసంగాలను ఏర్పాటు చేశారు.  భారతీయ సమాజంలోని మత, ఆధ్యాత్మిక, వ్యాపార, పరోపకార మరియు సామాజిక సంస్థలతో సహా పలువురు భాగస్వాములతో   కోవిడ్ రెస్పాన్స్ టీం (సిఆర్‌టి) ఈ ప్రసంగాలను ఏర్పాటు చేసింది.

మంగళవారం ప్రారంభమైన పాజిటివిటీ అన్‌లిమిటెడ్ సిరీస్ బుధవారం ఎడిషన్‌లో ముగ్గురు వక్తలు ప్రేమ్‌జీ, రవిశంకర్,  వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షుడు కన్యాకుమారి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 15న  మాట్లాడనున్నారు.