రైతుల నిరసనల నుండే కరోనా రెండో వేవ్ వ్యాప్తి?

వేణుగోపాల్ నారాయణన్ 

భారతదేశం చివరకు వుహాన్ వైరస్ వినాశకరమైన రెండో వేవ్ ఉధృతను ఎదుర్కొంటున్నప్పుడు అటువంటి పరిస్థితులు ఎందుకు దారితీసాయో నిస్పక్షపాతంగా అర్ధం చేసుకోవలసి ఉంది.  ఇటువంటి విధ్వంసక పరిస్థితులు తిరిగి తలెత్తవచ్చనే హెచ్చరికలు వెలువడుతున్న దృష్ట్యా అసలేమీ జరిగిందో విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంది. అసలు రెండో వేవ్ ఎక్కడ, ఏ విధంగా ప్రారంభమైనదో అనే ప్రశ్న నుండి ఈ విశ్లేషణ ప్రారంభం కావాలి. 

ప్రస్తుతం సాధారణంగా మనం అనుకొంటున్నది రెండో వేవ్  2021 ఫిబ్రవరి మధ్యలో మహారాష్ట్రలో ప్రారంభమైందని, తర్వాత కొన్ని వారాలలో దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించినదని అనుకొంటున్నాము.  కానీ అది నిజం కాదు.  వాస్తవానికి, 2021 జనవరి ప్రారంభంలో పంజాబ్‌లో రెండవ వేవ్  ప్రారంభమైందని డేటా విశ్లేషణ చూపిస్తుంది.  అక్కడ రైతుల ఆందోళన శ్రీకారం స్పష్టం చేస్తుంది.  వుహాన్ వైరస్ కు వైవిధ్యమైన ప్రాణాంతక యుకె వైరస్ నుండి వచ్చినదని స్పష్టం అవుతున్నది.

అంతకు ముందు భయపడుతున్నట్లుగా రైతుల నిరసనల నుండే ఈ వైరస్ మూలం ఆవిర్భవించినట్లు భావించవలసి వస్తున్నది. తాజా వైరస్ ముంబై, పూణే నగరాలలో విధ్వంసాలు సృష్టించడానికి ఒక నెలరోజుల ముందే ఇక్కడ ఆవిర్భవించడం గమనార్హం. 

ఇది క్రమంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ మీదుగా వ్యాపించింది.  కాలక్రమానుసారం ఎర్రకోట వద్ద రిపబ్లిక్ డేకు పక్షం రోజుల తర్వాత అక్కడ అల్లకల్లోలం సృష్టించింది. దీని ఫలితంగానే యుకె తరహా వైరస్  ఇప్పుడు ఆ ప్రాంతంలోని ఎక్కువ కేసులకు కారణమైంది. ఇప్పుడు నెలల తరబడి పబ్లిక్ డొమైన్‌లో ఈ డాటా అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకనో ఎవ్వరు పట్టించుకోవడం లేదు. 

ఈ వ్యాప్తి వాస్తవానికి 2020 చివరలో మొదలయింది. రైతుల నిరసనలకు అనుగుణంగా అక్టోబర్, డిసెంబర్ మధ్య ఉత్తర భారతదేశాన్ని తాకిన ప్రాంతీయ రెండవ వేవ్ . చండీఘర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ,  ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో ఈ రెండవ  వేవ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని ‘మొదటి నిరసన తరంగం’ అని పిలుద్దాము.

ఉత్తర ప్రదేశ్ లో దీని ప్రభావం పశ్చిమ యుపిలోని కొన్ని జిల్లాలకు, ఢిల్లీకి పరిమితమైనది.  యుపిలో సెప్టెంబర్ నుండి స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. ఏది ఏమైనా, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మొదటి నిరసన తరంగాన్నీ నివారింప గలిగారు. ఫిబ్రవరి 2021 ప్రారంభంలో రెండవ వేవ్ పెరిగే వరకు కొనసాగిన క్షీణతను ఏకరీతిలో అమలు చేశారు.

పంజాబ్ లో ఈ వైరస్ వ్యాప్తి 2021 జనవరి మొదటి వారంలో ఆగిపోతుంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు  రోజుకు 200 కేసులు నమోదై,  ఆ తర్వాత అది మళ్లీ పెరగడం ప్రారంభమైనది. ఏది ఏమైనా, పంజాబ్ లో జనవరి, 2021 మొదటి 10 రోజులలో కేసుల పెరుగుదల నెలకొంది.

పంజాబ్ లో కోవిద్ టెస్ట్ లు డిసెంబర్, 2020 మొదటి నుండి ఫిబ్రవరి, 2021 మొదటి వరకు తగ్గుతూ వచ్చాయి. 2021 జనవరి మధ్యలో కేసులు పెరుగుతూ ఉండడంతో టెస్ట్ లు కూడా  కొద్దిపాటుగా  పెరిగాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య జనవరి మొదటి వారంలో తగ్గుముఖం పట్టాయి. మరో నెల వరకు సగటున రోజుకు 10 చొప్పున మాత్రమే ఉన్నాయి. మరణాలు పూర్తిగా నమోదు కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

అయితే లుధియానాలో జనవరి అంతా కేసులు పెరుగుతూ,  రెండవ వేవ్ ఉధృతంగా ప్రవేశించిన ఫిబ్రవరి  మొదటి పక్షంలో ఉధృతం అవుతూ వచ్చాయి. అమృతసర్, జలంధర్ లలో కూడా రోజువారీ కేసుల పెరుగుదల కనిపిస్తుంది. అయితే జనవరి మధ్య నుండి కొద్దీ వారల పాటు తగ్గుముఖం పట్టాయి.

జనవరి మొదటి పక్షంలో కేసులు పెరుగుతూ ఉండడాన్ని చాలామంది విశ్లేషకులు గమనించినట్లు లేదు. పంజాబ్ లోని ఈ మూడు జిల్లాలో కేసులు తగ్గుదల ధోరణి జనవరి మొదటి వారంలో తిరుగుముఖం పట్టడం గమనిస్తే రైతుల నిరసనల ప్రభావం కనిపిస్తుంది.

పంజాబ్ లోని ఈ మూడు జిల్లాలో కనిపించిన ధోరణులే ఢిల్లీకి మార్గంలో గల హర్యానాలోని పలు జిల్లాలో కనిపిస్తున్నాయి. చండీఘర్ శివారులోని పంచకులలో రోజువారీ కేసులు జనవరి 5 నుండి పెరుగుతూ వచ్చాయి. గురుగ్రామ్ లో జనవరి 6 నుంచి, ఫరీదాబాద్ లో జనవరి 3 నుంచి పెరుగుతూ వచ్చాయి. అయితే జనవరి 15 తర్వాత ఈ ధోరణి లేదు. ఈ ప్రాంతాలు అన్ని పంజాబ్ నుండి ఢిల్లీ వెళ్లే రోడ్ మార్గంలో ఉండడం గమనార్హం. 

పంజాబ్ లో వలే హర్యానాలో సహితం ఈ సమయంలో టెస్టింగ్ 75 శాతం మేరకు  తగ్గింది. డిసెంబర్, 2020న రోజుకు 40,000 వరకు జరుగగా, ఫిబ్రవరి 1 నాటికి అవి 8,000 కు తగ్గాయి. దానితో వాస్తవ పరిస్థితి పూర్తగా వెల్లడి కాకుండా ఉండేందుకు దారితీస్తుంది. 

ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘర్ లో సహితం ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా డిసెంబర్ మధ్య నుండి జనవరి మొదటి వారం వరకు కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే జనవరిలో చాలారోజులలో అసలు టెస్టింగ్ జరగక పోవడంతో వాస్తవ పరిస్థితి వెల్లడి కావడం లేదు. 

రోజువారీ కేసుల తగ్గుదల అకస్మాత్తుగా జనవరి 28 నుండి ఆగిపోవడం గమనార్హం. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల భారీ నిరసనల ధ్వారా ఫిబ్రవరి లో రెండవ వేవ్ ఉధృత రూపం దాల్చిన్నట్లు లభిస్తున్న గణాంకాల నుండి అర్ధం చేసుకోవచ్చు. ఈ గణాంకాల విశ్లేషణను పరిశీలిస్తే రెండవ వేవ్ మూలం పంజాబ్, హర్యానా, చండీఘర్ లలోని వివిధ ప్రాంతాలలో జనవరి మొదట్లోనే  ఉన్నదని, అందరు అనుకొంటున్నట్లు మహారాష్ట్రలో మరో నెల తర్వాత కాదని స్పష్టం అవుతుంది. 

కేరళలో మార్చ్ లో ఆలస్యంగా రెండో వేవ్ ప్రారంభమయ్యే సమయానికి  రోజువారీ కేసులు వాస్తవానికి ఫిబ్రవరి, మార్చ్, 2021 లలో తగ్గుముఖం పట్టాయి. అదే విధంగా, 2020 సెప్టెంబర్ మధ్య నుండి ఫిబ్రవరి, 2021 మొదట్లో వరకు మహారాష్ట్రాలో కూడా రెండో వేవ్ ఉధృతమయ్యే సమాయాని కేసులు తగ్గుముఖం పట్టాయి. 

కరోనా మహమ్మారో సమయంలో రైతుల నిరసనలు ఇటువంటి ఉపద్రవంకు దారితీసే అవకాశం ఉన్నట్లు చలామంది హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారు వినలేదు. అనేక వేలమందిలో, స్పష్టంగా అపరిశుభ్రమైన వాతావరణంలో నెలల తరబడి మొదట ఢిల్లీ పశ్చిమ రహదారులలో, ఆ తర్వాత తూర్పు వైపున భైటాయింపు జరిపారు. 

ఇప్పుడు లభిస్తున్న గణాంకాలను సరిగ్గా విశ్లేషణ చేసుకొంటే రెండవ వేవ్ మూలల్లో రైతుల నిరసనలోనే ఉన్నట్లు అర్ధం అవుతుంది. జనవరి, 2021 ప్రారంభం నుండి రిపబ్లిక్ డే నాటి అల్లర్ల మారణహోమం సమయంలో పంజాబ్, హర్యానాల ద్వారా ఢిల్లీకి చేరి, ఆ తర్వాత దేశం అంతా వ్యాప్తి చెందిన్నట్లు తెలుస్తుంది.

(స్వరాజ్య పోర్టల్ ఆధారంగా)