సోపార్ ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

జ‌మ్ముక‌శ్మీర్‌లోని సోపార్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురు కాల్పులు సంభ‌వించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్ద‌రు ముష్క‌రులు హ‌త‌మ‌య్యారు.

సోపార్ పట్ట‌ణంలోని నాతిపురా గోసియా కాల‌నీలో ఉన్న ఇళ్ల‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారం భ‌ద్ర‌తా ద‌ళాల‌కు అందింది. దీంతో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు.. క‌శ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ క‌లిసి సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి.

ఈ సంద‌ర్భంగా టెర్ర‌రిస్టుల‌ను లొంగిపోవాలని కోరిన‌ప్ప‌టికీ వారు స్పందించ‌క‌పోగా, సైన్యంపై కాల్పులు ప్రారంభించార‌ని జ‌మ్ము పోలీసులు తెలిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని వెల్ల‌డించారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.