కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ నిర్వహణ కోసం అనుమతి ఇచ్చింది.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత అభివృద్ధి చేస్తున్న రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్. రెండో విడుత ట్రయల్స్‌లో పాల్గొన్న 200 మంది ప్రాథమిక భద్రతా డేటానును డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షించింది. చివరి విడుత ట్రయల్స్ కోసం మంగళవారం అనుమతి ఇచ్చింది.
ఐసీఎంఆర్, నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రయల్స్ నుంచి ప్రిన్సిపల్ ఇవ్వెస్టిగేటర్ కోఆర్డినేటింగ్ సైంటిస్ట్ డాక్టర్ అభిజిత్ కదమ్ మూడో దశ ట్రయల్స్ మే మధ్య నాటికి ప్రారంభం కావాలని పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన నోవావాక్స్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను భారత్‌లో కోవోవాక్స్ పేరుతో సీరం కంపెనీ ఉత్పత్తి చేయనుంది. దేశవ్యాప్తంగా 19 సైట్లలో ట్రయల్స్ జరుగనుండగా.. త్వరలోనే వలంటీర్లను నియమించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సైట్ల పరిశోధకులు తెలిపారు. టీకాను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
More Stories
శ్రీనగర్ మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు.. 12 మందికి గాయాలు
పూరి ఆలయంలో రహస్య సొరంగం లేదు
శ్రీనగర్ ఎన్ కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!