`కాశీ’లో పురావస్తు సర్వేకు అనుమతి  

కాశీ విశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్‌వపీ మసీదు ఆవరణలో పురావస్తు శాఖ సర్వేకి వారణాసి కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. ఆవరణ మొత్తం కాశీవిశ్వనాథ్ ఆలయానిదేనని, జ్ఞాన్‌వపీ మసీదు అందులో భాగం మాత్రమేనంటూ 1991లో విజయ్ శకర్ రస్తోగీ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆవరణలో పురావస్తు శాఖ సర్వేకు ఆదేశించింది. ఆదేశాలను గతవారం రిజర్వు చేసిన సివిల్ జడ్జ్ అశుతోష్ తివారీ నేడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్ఐకి చెందిన ఐదుగురు సభ్యుల బృందం ఆవరణలో అధ్యయనం నిర్వహించాలని ఆదేశించారు. సర్వేకు అయిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సూచించారు.

ఆ శిథిలాలతో అక్కడే మసీదు నిర్మించాడంటూ మూడు దశాబ్దాల క్రితం దాఖలైన ఓ పిటిషన్‌పై ఈ ఆదేశాలు ఇచ్చిం ది. సర్వేకు పురావస్తు నిపుణులు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేయాలని, వారిలో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందినవా రు ఉండాలని ఏఎస్‌ ఐను కో ర్టు ఆదేశించింది. ఈ కమిటీకి పరిశీలకుడిగా ప్రముఖ విద్యావేత్తను నియమించాలని తెలిపింది. స్థానిక కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్‌ చేస్తామని సున్నీవక్ఫ్‌ బోర్డు తెలిపింది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని తన పిటిషన్‌లో పేర్కొన్న రస్తోగి ఏఎస్ఐ సర్వేకు ఆదేశించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కోర్టును అభ్యర్థించారు.

కాశీవిశ్వనాథ ఆలయాన్ని 2 వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించారని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చి వేసి, మసీద్ నిర్మించారని రస్తోగి తన పిటిషన్‌లో ఆరోపించారు. కాగా, ముస్లింలు మాత్రం 15 ఆగస్టు 1947 నాటి స్థితిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము హైకోర్టులో సవాలు చేస్తామని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు తెలిపింది.

అయోధ్యలో సహితం పురావస్తు తవ్వకాల ఆధారంగానే అక్కడ రామమందిరం నిర్మాణంకు సుప్రీం కోర్ట్ అనుమతి ఇవ్వడం గమనార్హం. ఔరంగజేబు దాడి సమయంలో ఆ ఆవరణలో ఉన్న ఒక చిన్న బావిలో ఆలయ ప్రధాన పూజారి శివలింగంతో సహా దూకి, దానిని వారి నుండి కాపాడారని చెబుతుంటారు. 1660లో కాశి విశ్వేశ్వర దేవాలయంను ధ్వంసం చేసి ఔరంగజేబు నిర్మించారు.

దేవాలయం, మసీద్ కు మధ్యలో ఉన్న ` జ్ఞాన్‌వపీ’ (జ్ఞానం బావి) పేరుతో దీనిని  జ్ఞాన్‌వపీ   మసీద్ అని పిలుస్తున్నారు. వేళా వేల సంవత్సరాలుగా ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతి కొన్ని వందల సంవత్సరాలకు పుననిర్మిస్తూ ఉన్నారు. అయితే అగ్ర జైలు నుండి తప్పించుకోవడానికి శివాజీ మహారాజ్ కు సహకరించిన హిందువులపై కక్ష సాధింపుగా ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసిన్నట్లు భావిస్తారు.

మరాఠా రాజు మల్హార్ రావు హోల్కర్ (1693-1766) ఈ మసీదును ధ్వంసం చేసి విశ్వేశ్వర మందిరం ఇక్కడ నిర్మించాలని ప్రయత్నించినా చేయలేకపోయారు. అయితే తర్వాత 1780లో ఆయన కోడలు అహిల్యాబాయి హోల్కర్ ప్రస్తుతం ఉన్న కాశి విశ్వనాధ్ దేవాలయాన్ని మసీద్ ప్రక్కన నిర్మించారు.

అక్బర్ కాలంలో రాజా మాన్ సింగ్ దేవాలయాన్ని నిర్మించినా ఛాందస హిందువులు తన కుటుంబంలోని మహిళలను మొగల్ రాజుకు ఇచ్చి వివాహం చేసాడనే ఆగ్రహంతో దానిని తిరిగి ధ్వసం చేశారు. అక్బరు సమకూర్చిన నిధులతో 1585లో రాజా తొడర్ మల్ కూడా 1585లో నిర్మించారు. అసలు దేవాలయాన్ని ఔరంగజేబు ధ్వసం చేసి మసీద్ నిర్మించిన తర్వాత కూడా పాత దేవాలయం శిధిలాలు మసీద్ పునాది,  నిర్మాణంలో కనిపిస్తూనే ఉన్నాయి. 1833-1840 ప్రాంతంలో బావి సరిహద్దులను, ఘాట్ లను, ఇతర సమీపంలోని  దేవాలయాలను తిరిగి నిర్మించారు.

దేవాలయం ఆవరణ నుండి ఘాట్ లకు మార్గం ఏర్పాటు చేయడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ `కాశి విశ్వనాధ్ కారిడార్’ కార్యక్రమం చేపట్టి, రోడ్ల వెడల్పు చేపట్టారు. అందుకోసం మసీద్ పరిసరాలలోని కొన్ని నిర్మాణాలను తొలగించారు.