భారత్‌లో త్వరలో సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్

భారత్‌లో సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించడానికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ పేరు జాన్సన్‌గా నామకరణం చేశారు.
 
అమెరికాతోపాటు యురోపియన్‌ యూనియన్‌, థాయ్‌లాండ్‌, సౌతాఫ్రికా లాంటి దేశాలు ఇప్పటికే ఈ సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌కు గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత భయపెడుతున్న సమయంలో ఈ వార్త కాస్త ఊరట కలిగించేదిగా చెప్పవచ్చు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన ఈ సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి సురక్షితమని, కరోనాపై సమర్థవంతంగా పని చేస్తోందని అమెరికా రెగ్యులేటర్‌ గతంలోనే చెప్పింది. యూఎస్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ 72 శాతం సమర్థంగా పని చేసినట్లు తేలింది. 
 
ఈ వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లలో కరోనాతో చనిపోయిన వాళ్లు ఎవరూ లేరు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో పని చేస్తోందని, తీవ్ర అస్వస్థత ప్రమాదాన్ని 85 శాతం మేర అరికట్టిందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడించింది. సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఉత్తమమైన ఆప్షన్‌ అని డబ్ల్యూహెచ్‌ఒ కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో తయారు చేసేందుకు బయోలాజికల్‌ ఇ-లిమిటెడ్‌తో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో 44 వేల మందికిపైగా వ‌లంటీర్లు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప‌రిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే మాత్రం అది క‌చ్చితంగా గేమ్ చేంజ‌రే అవుతుందన‌డంలో సందేహం లేదు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనేది ఉత్త‌మమైన ఆప్ష‌న్ అని డ‌బ్ల్యూహెచ్‌వో కూడా స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో త‌యారు చేసేందుకు బ‌యోలాజిక‌ల్ ఇ లిమిటెడ్‌తో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.