వాక్సిన్ కొరత లేనే లేదు 

వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సిన్ కొరత ఉందన్న వార్తలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలకూ అవసరమైనన్ని వాక్సిన్ డోస్‌లు అందజేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం కొలకొత్తాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ కొరత ఉందన్న సమాచారం సరికాదని స్పష్టం చేశారు. 
కేంద్ర బలగాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఓ ప్రశ్నకు సమాధానంగా అమిత్‌షా చెప్పా రా అని ప్రశ్నించారు. ఎన్నికల విధుల్లో భాగంగానే బలగాల ను మోహరిస్తారని, అది హోం మంత్రి పరిధిలోకి రాదని చెప్పారు.
ఎన్నికల కమిషన్ పరిధిలోకే బలగాల మోహరింపు వస్తుందని పేర్కొన్నా రు. సీఆర్‌పీఎఫ్‌ను ఘెరావ్ చేయమంటూ ప్రకటనలు చేస్తున్న నేతను కానీ, సీఎంను కానీ తాను ఎప్పుడూ చూడలే దని పేర్కొన్నారు. మైనారిటీలు కలిసికట్టుగా ఉండాలని, టీఎంసీకి ఓటు వేయాలని మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపుపై కూడా ఆయన  స్పందించారు.
మైనారిటీ ర్శిటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని, గోర్ఖా కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొదటి మూడు విడతల పోలింగ్‌లో బీజేపీకి అసాధారణ మద్దతు లభించిందని, తమ అంచనా ప్రకార ఇప్పటి వరకూ జరిగిన పోలింగ్‌లో 63 నుంచి 68 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కోల్‌కతాలోని భొవానిపూర్‌లో బీజేపీ శుక్రవారంనాడు ఇంటింటి ప్రచారం చేపట్టింది. మమతా బెనర్జీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈసారి నందిగ్రామ్‌ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. కాగా, నాలుగో విడత పోలింగ్ శనివారంనాడు జరుగనుంది.
 
కాగా, అమిత్‌షా శుక్రవారం కోల్‌కతాలోని పార్టీ కార్యకర్త ఇంట్లో మధ్యాహ్న భోజనం తీసుకున్నారు. కోల్‌కతాలో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడైన సమరేంద్ర ప్రసాద్ బిస్వాస్‌తో కలిసి ఆయన లంచ్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పేందుకే ఈ విందులో కేంద్ర మంత్రి పాల్గొన్నట్టు తెలిపారు.
 
’89 ఏళ్ల బిశ్వాస్ జనసంఘ్ కార్యకర్త మాత్రమే కాకుండా రాష్ట్రంలో బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1980లో ఆయన బీజేపీ సభ్యుడయ్యారు. అప్పటి నుంచి సంస్థ పటిష్టతలో కీలక భూమిక పోషించారు. ఆయన ఇంట్లో లంచ్ చేయడం ద్వారా పార్టీ కార్యకర్తకు అమిత్‌షా అరుదైన గౌరవం ఇచ్చారు’ అని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
పార్టీ నేతలు స్వపన్ దాస్ గుప్తా, దినేష్ త్రివేది కూడా ఈ లంచ్‌లో పాల్గొన్నారు. కాగా, తమ ఇంటికి వచ్చిన అతిథుల కోసం బెంగాలీ వంటకాలు, ఐదు రకాలైన ప్రత్యేక స్వీట్లు తయారు చేసి, వడ్డన చేసినట్టు సమరేంద్ర ప్రసాద్ బిశ్వాస్ కుమార్తె చైతి తెలిపారు.